Diwali Vastu Tips: లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి చాలా శ్రమిస్తుంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. దీపావళి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులు పాటించాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే దీపావళి వేళ మన ఇంటిలోని కొన్ని ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. వాస్తు నిపుణులు, పండితుల అంచనాల ప్రకారం ఇంట్లోని ముఖ్యమైన ప్రాంతాలను కచ్చితంగా పరిశుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని కొలిస్తే ఫలితం ఉంటుంది. దీనికి అందరు నియమాలు పాటించి దేవతను పూజించడం కోసం ప్రయత్నించాలి.

సాధారణంగా ఏ పండుగ వచ్చినా ఇల్లు శుభ్రం చేసుకోవడం అలవాటు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి శుభ్రం చేసుకుంటే మంచిది. దీంతో ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లోకి సానుకూల వాతావరణం ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని పాతవస్తువులు, విరిగిపోయిన పాత్రలు బయటపడేయాలి. పగిలిన దేవుడి దేవుడి విగ్రహాలు, ఫొటోలు పండగ కంటే ముందే నిమజ్జనం చేయాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూల అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. దీపావళి ధనత్రయోదశికి ముందు ఇంట్లోని ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. దేవతల ప్రత్యేక ప్రదేశంగా ఈశాన్యాన్ని పేర్కొంటారు కచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తరువాత ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం ఉప్పు కలిపి ఇళ్లంతా చల్లుకుంటే ప్రతికూల శక్తులను దూరం చేసుకోవచ్చు. ఇంట్లోని ఈశాన్య మూలలో లక్ష్మీదేవి కొలువుంటుంది. అందుకే కుబేరుడి ఆశీస్సులు కూడా ఉండటానికి ప్రయత్నించాలి.

పూజా గదిని ఎరుపు, ఆకుపచ్చ, నారింజ, పసుపు రంగులతో అలంకరించొచ్చు. దేవుళ్లను కొలిచే సమయంలో స్వస్తిక్ రంగోలిని వేయడం ఇంకా శుభంగా భావించుకోవచ్చు. తూర్పు దిశను కూడా సానుకూలంగానే చూసుకోవచ్చు. దీపావళి రోజున నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు. మట్టి దీపాలతోనే దీపాలు వెలిగించాలి. మట్టి దీపాల్లో నువ్వుల నూనె, నెయ్యితో దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుంది. దీపాల సంఖ్య 11,21,31,41 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.