Bramha Muhurtham: ప్రతిరోజు మనకు కొన్ని ఘడియలలో శుభ ముహూర్తాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలలు వంటివి ఉంటాయి. ఇక శుభముహూర్తాలు సమయంలోనే మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. దుర్ముహూర్తం సమయంలో ఎటువంటి పనులు ప్రారంభించం. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది కూడా ఉంటుంది.
ముఖ్యంగా ఆ సమయంలో ఏది కోరుకుంటే అది పక్క తీరుతుంది. ఆ సమయంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు కాబట్టి మనం ఏది కోరుకున్నా వెంటనే తీరిపోతుంది. ఆ సమయంలో నిద్రలేచి ఒక 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ సమయంలోనే ఓంకారం ను ఒక 21 సార్లు పలికితే చాలా శక్తి లభిస్తుంది.
అందుకే ఆ సమయంలో ఏది అనుకున్నా అది వెంటనే తీరిపోతుంది. ఇక అలా ఒక 21 రోజులు చేస్తే కచ్చితంగా అనుకున్నవి తీరుతాయి. అంతేకాకుండా ఉదయాన్నే లేచి నట్లయితే సంపద కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది.
అంతేకాకుండా బ్రహ్మ ముహూర్త సమయంలో విద్యార్థులు చదువుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రతి రోజూ ఉదయాన్నే లేచి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి కాసేపు శ్వాస మీద దృష్టి పెట్టి కావలసిన కోరికలను కోరుకుంటే చాలు వెంటనే తీరిపోతుంది.