Control anger achieve success: ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ కొందరు మాత్రమే వీటిని పరిష్కరించుకోగలుగుతారు. మిగతావారు ఆ సమస్యలను చూసి భయపడుతూ ఉంటారు. సమస్యలే తమ జీవితానికి పెద్ద సమస్య అని బాధపడుతూ కూర్చుంటారు. కానీ కొందరైతే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకుంటారు. మరోసారి ఆ సమస్య రాకుండా చూసుకుంటారు. చుట్టుపక్కల వాతావరణం అలజడిగా ఉన్నా.. గందరగోళ పరిస్థితులు ఏర్పడినా.. వీరిలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు. మరి వీరు అలా ఎందుకు ఉండగలుగుతారు? వీరిలో ఉన్న ఆ పవర్ ఏంటి?
ప్రతి వ్యక్తి తన సమస్యను తానే పరిష్కరించుకునే శక్తిని కలిగి ఉంటాడు. కానీ ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోతు ఉంటాడు. దీంతో చిన్న చిన్న వాటికే కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడకుండా ఉండాలంటే పరిస్థితిని కంట్రోల్ చేసే శక్తి ఉండాలి. అంటే ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా.. దేనికోసమైతే చూస్తున్నారో.. దానిపైనే దృష్టి పెట్టాలి. ఆ విషయం గురించి మాత్రమే ఆలోచించాలి. మిగతా చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తూ.. వాటికి స్పందిస్తూ.. కోపం తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. కోపాన్ని కంట్రోల్లో ఉంచగలిగితే ఎటువంటి పరిస్థితినైనా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే కొందరు ఎంత పెద్ద సమస్యను అయినా ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు.
ఒక వ్యక్తికి సమాజంలో ఎంతో గుర్తింపు ఉంటుంది. కానీ అతడు ఒక లక్ష్యం కోసం పనిచేస్తాడు. అయితే మధ్యలో కొందరు అతడిని అవమానిస్తారు. మరికొందరు తాను చేసే పనులను అడ్డుకుంటారు. అయితే ఆ వ్యక్తి కనుక తాను చేపట్టిన పని విజయవంతం కావాలంటే ఇలాంటి వారిని అస్సలు పట్టించుకోవద్దు. అంతేకాకుండా వారు చెప్పే మాటలు అస్సలు వినొద్దు. ఎవరు ఏమనుకున్నా.. చేయాలనుకున్న పని కోసం నిత్యం శ్రమిస్తూ ముందుకు వెళితే.. కచ్చితంగా విజయం సాధించగలరు. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ.. ప్రతి విషయాన్ని పట్టించుకోవడం వల్ల ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. ఈ చిన్న విషయాల వల్లే తల భారంగా మారుతుంది. అప్పుడు ఆ తర్వాత చేయాలనుకున్న పనిని చేయలేరు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో అయినా టార్గెట్ ను ఏర్పాటు చేసుకొని దానికోసం మాత్రమే ఆలోచించాలి. మధ్యలో వచ్చే ఎటువంటి విషయాలకు స్పందించకూడదు.
ఇదే సమయంలో కోపాన్ని కంట్రోల్ చేయడం వల్ల మిగతా విషయాలపై పెద్దగా ఫోకస్ పడదు. కేవలం అనుకున్న పనిని మాత్రమే పూర్తి చేయడానికి బలం పెరుగుతుంది. ఏ పరిస్థితుల్లో అయినా కోపం ను కంట్రోల్ చేయగలిగితే.. ఎవరినైనా అదుపులో ఉంచుకునే శక్తి వస్తుంది. అంతేకాకుండా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే ఆలోచన కూడా వస్తుంది. అందువల్ల కోపాన్ని కంట్రోల్ చేసే శక్తిని అలవర్చుకోవాలి.