Habits that make you poor: మంచి జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఒక జీవితం నాశనం కావడానికి కొన్ని అలవాట్లే కారణమని తెలుస్తుంది. ఈ అలవాట్లు బ్యాడ్ అని అందరికీ తెలుసు కానీ చాలామంది వీటికి బానిస అయిపోయి తమ లైఫ్ ను స్పాయిల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఐదు అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అంతేకాకుండా ఈ అలవాట్లు కేవలం ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాయి. ఒకవేళ ఇప్పటికే ఈ అలవాట్లు ఉంటే ఇప్పటినుంచి అయినా వీటికి దూరంగా ఉండడమే మంచిది. మరి జీవితాన్ని ముంచే ఆ ఐదు అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
మద్యం:
మద్యం అలవాటు ఉన్నవారు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే. ఎందుకంటే మద్యం ఒకరోజు తాగిన తర్వాత బాగానే ఉంటుంది. కానీ మరో రోజు మద్యం తాగితేనే బాగుంటామని అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు మద్యం లేకుండా ఉండలేని రోజులు కూడా వస్తాయి. అయితే ఇటువంటి సమయంలో డబ్బులు ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటాం. ఇలా కొందరు తమ జీవితాన్ని నాశనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.
ధూమపానం:
ఈ అలవాటు వల్ల కూడా డబ్బు వృధా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం నాశనం అవుతుంది. ఈ అలవాటు ఉండటం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడి ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో జీవితాంతం చేసిన కష్టం అంతా వృధా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ అలవాటుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
బ్రాండెడ్ దుస్తులు:
కొంతమంది ఎక్కువ ధరకు ఉన్న దుస్తులు కొనుగోలు చేస్తే సమాజంలో తమ హోదా పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఇది కొంతవరకు మాత్రమే. కేవలం దుస్తులను మాత్రమే కాకుండా వ్యక్తి ప్రవర్తనను కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు.. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న దుస్తులు దొరికే ఛాన్స్ ఉంది. అందువల్ల బ్రాండెడ్ దుస్తులపై అదనంగా ఖర్చు పెట్టకుండా క్వాలిటీ ఉన్న దుస్తులు కొనుగోలు చేయడంలో దృష్టి పెట్టాలి.
గర్ల్ ఫ్రెండ్ :
నేటి కాలంలో గర్ల్ ఫ్రెండ్ ఉండడం కామన్. అయితే ప్రతి విషయంలో ఖర్చు పెట్టే అమ్మాయి ఉంటే వెంటనే దూరంగా ఉండిపోండి. ఎందుకంటే చేసినా సంపాదనలో ఈ గిఫ్టులకే పోతుంది. నిజంగా ప్రేమించే అమ్మాయి వస్తువులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేయదు. అందువల్ల ఈ అలవాటు ఉన్నవారు దూరం చేసుకోవడమే మంచిది.
గ్యాంబ్లింగ్:
ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ చేయడం తగ్గిపోయింది. అయితే ఇదే సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశ పెరిగిపోయింది. దీంతో కొంతమంది రకరకాల పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వీటిలో పేకాట, బెట్టింగ్ వంటివి కూడా ఉంటాయి. అయితే ఇవి జీవితాన్ని ఒక్కసారి అట్టడుగునా చేర్చి మళ్లీ పైకి లేవకుండా చేస్తాయి. అందువల్ల ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.