Delete Apps: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అడ్డదారుల్లో అక్రమ సంపాదన కోసం నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో క్షణాల్లో మన డబ్బు మాయమైపోతుంది. ఇటీవల కొత్త యాప్ లను కనుక్కుంటున్నారు. వినూత్న రీతిలో యాప్ లు క్రియేట్ చేస్తూ వాటితో డబ్బులు దొంగలిస్తున్నారు. సోవా అనే వైరస్ సృష్టించి వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఖాతాదారుల డబ్బు క్షణాల్లో కనిపించకుండా పోతోంది. మోసగాళ్ల మోసాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బ్యాంకుల్లో డబ్బు ఉంచుకుందామనుకున్నా సైబర్ నేరగాళ్ల బెడద పెరిగిపోతోంది.

సోవా వైరస్ ను అనేక లింకుల రూపంలో ఫోన్లకు పంపిస్తున్నారు. దానిపై క్లిక్ చేస్తే చాలు మన సమాచారం మొత్తం నేరగాళ్లకు తెలిసిపోతోంది. దీంతో వారు మన ఖాతాల్లోని డబ్బులను తస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా విచారణ చేస్తున్నా నేరగాళ్ల ఆచూకీ చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు వినియోగదారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతు లేకుండా పోతోంది.
నేరగాళ్లు పంపే యాప్ లను క్లిక్ చేస్తే చాలు మన పాస్ వర్డుతో సహా అన్ని వివరాలు తెలిసిపోతున్నాయి. ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర నేరగాళ్ల మాయలో పడితే డబ్బులు గుల్ల కావాల్సిందే. కష్టపడి సంపాదించిన డబ్బును అప్పనంగా దోచిపెట్టేందుకు మార్గం కల్పించకూడదని చెబుతున్నారు. నేరగాళ్ల యాప్ లను ఎట్టిపరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మనకు ఇబ్బందులే వస్తాయి. ఈ క్రమంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ యాప్ లు ఒకవేళ మన ఫోన్ లో కనిపిస్తే వెంటనే డిలీట్ చేస్తేనే రక్షణగా ఉంటుంది. వాటిని అలాగే ఉంచుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వాటిపై క్లిక్ చేస్తే ఇక అంతేసంగతి. మన సమాచారం కాస్త వారికి చేరుతుంది.

సోవా వైరస్ దాదాపు 200 రకాల వైరస్ లతో బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తిస్తుంది. దీంతో మన వ్యవహారాలు మొత్తం వారికి తెలిసిపోతుంది. సైబర్ నేరగాళ్ల టాలెంట్ తో పలు రకాలుగా వినియోగదారుల డబ్బులు మాయం చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మాయగాళ్ల మాయలో పడి తమ డబ్బులు ఊరికే తస్కరణకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుస్తోంది.