Kashmiri Nakh fruit  : ఈ పండు పేదల ప్రొటీన్ పౌడర్.. ఒక్కసారి తింటే సమస్యలన్నీ మాయం

తక్కువ రేటుతో ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ పండ్లను డైలీ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కంటి, చర్మ ఆరోగ్యంతో పాటు ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పండ్లు వల్ల కలిగే ప్రయోజనాలేంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By: Bhaskar, Updated On : October 8, 2024 7:37 pm

Kashmiri Nakh fruit 

Follow us on

Kashmiri Nakh fruit  : మనం రోజూ ఎన్నో రకాల పోషక విలువలు ఉండే పదార్థాలను చూస్తుంటాం. కానీ కొన్ని రకాల పండ్లు రేట్లు అధికంగా ఉండటంతో వాటిని కొనే సాహసం అసలు చేయం. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉండటంతో పాటు రేటు కూడా అధికంగానే ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలని కొందరు ఆలోచించి.. ఎంత రేటు అయిన కూడా పండ్లు కొని తింటారు. మరికొందరు ఇంత రేటు అవసరమా అని వాటికి బదులు వేరే పండ్లను కొని తింటారు. ఎక్కువ పోషకాలతో పాటు తక్కువ రేటు ఉన్న పండ్లు కూడా ఉంటాయి. ఈ పండ్లను ధనవంతులే కాదు.. పేదలు కూడా కొని తినగలరు. అలాంటి వాటిలో కాశ్మీరీ నఖ్ ఒకటి. ఇది చూడటానికి పియర్ పండులానే కనిపిస్తుంది. తినడానికి ఎంతో రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తక్కువ రేటుతో ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ పండ్లను డైలీ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కంటి, చర్మ ఆరోగ్యంతో పాటు ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పండ్లు వల్ల కలిగే ప్రయోజనాలేంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

కాశ్మీరీ నఖ్ పండు ఎక్కువగా కాశ్మీర్‌లో పండుతుంది. చూడటానికి పియర్ లాగా కనిపించిన తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండును డైలీ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. చర్మంపై ఎలాంటి ముడతలు, మొటిమలు రాకుండా కాపాడటంలో ఈ పండ్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ పండులో ఎక్కువగా పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, ఫొలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేయడంతో పాటు బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తాయి. ఫైబర్, యాంటీ డయాబెటిక్ వంటి లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేయడంతో పాటు మధుమేహాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

కాశ్మీరీ నఖ్ పండును డైలీ తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో నీటి శాతం కూడా అధికంగానే ఉంటుంది. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే ఈ పండు ఎక్కువగా వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. సీజనల్‌గా లభ్యమయ్యే ఈ పండును దొరికినప్పుడే తినాలి. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. కొందరు ఎంత ఆహారం తీసుకున్న చాలా నీరసంగా ఉంటారు. అలాంటి వారు ఈ పండును తింటే ఇట్టే నీరసం, అలసట అన్ని పోతాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. కాబట్టి ఈ పండును అసలు తినడం మిస్ చేసుకోవద్దు. సీజన్‌లో కనీసం రెండు, మూడు రోజులకొకసారైన తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.