Peace and wealth: మానవ జీవితానికి చెట్లు చాలా అవసరం. స్వచ్ఛమైన గాలిని పొందాలంటే చెట్లు తప్పనిసరిగా కావాలి. ప్రస్తుత కాలంలో కొన్ని పనుల నిమిత్తం చాలా చోట్ల చెట్లను నరికివేస్తున్నారు. కానీ మళ్లీ ప్లాంటేషన్ జరగడం లేదు. అయితే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.అయినా మనుషులకు తగినంత చెట్లు లేవనే చెప్పాలి. అయితే పట్టణాల్లు, నగరాల్లో ఉండేవారు చెట్ల గాలిని పీల్చుకోవడం తక్కువ అందుకే చాలా మంది ఇళ్లలోనే కొన్ని మొక్కలను పెంచుకుంటున్నారు. కానీ ఇంట్లో ఏది పడితే అది ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. అయితే ఈ మొక్క ఇంట్లో ఉండం వల్ల ఇల్లో సంతోషంగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఆ మొక్క ఏదంటే?
సిటీ లో ఉండే వారు చాలా మంది ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం అలవాటుగా మార్చుకుంటున్నారు. మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని మొక్కలు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా లాభాలను తీసుకువస్తుంది. వీటిలో రబ్బరు మొక్క ఒకటి. రబ్బరు మొక్క ఒకటి. దీనినే ఫిస్కస్ ఎలస్టికా అని కూడా పిలుస్తారు. దీని ఆకులు నిత్యం ప్రెష్ గా కనిపిస్తాయి. దీంతో దీనిని చూసినప్పుడల్లా మనసు ఉల్లాసంగా మారుతుంది. దీనిని గదిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో చెడు గాలి ఉంటే దానిని శుభ్రం చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.
రబ్బరు మొక్క స్వచ్ఛమైన గాలిని ఇవ్వడమే కాకుండా సిరి సంపదలను కూడా తెస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఎలాంటి వివాదం ఏర్పడినా తొందర్లోనే సమసిపోతుంది. ఆర్థికంగా పుంజుకోవాలనుకునేవారు దీనిని ఇంట్లో పెట్టుకోవచ్చని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రబ్బరు మొక్కు డబ్బును ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా పారద్రోలుతుంది. రబ్బర్ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది.గాలిలో ఉండే ఫార్మాల్టిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ ను లేకుండా చేస్తుంది. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో వాళ్లు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలర్జీ సమస్యలు ఉన్నవారికి దీనితో ఫలితం ఉంటుంది. ఎక్కువగా శీతాకాలంలో సమతుల్య వాతావరణం ఉండేలా చేస్తుంది. రబ్బరు మొక్కను ప్రత్యేకంగా కుండీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మంచిగా పెరగాలంటే నీటితో పాటు ఎరువు కూడా వేయాల్సి ఉంటుంది. అలాగే మొక్క ఆరోగ్యంగా ఉంటేనే ప్రశాంతమైన గాలి ఉంటుంది. దీనిని ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
రబ్బరు మొక్క దక్షిణ చైనా కు చెందిన మోరేసి కుటుంబానికి చెందినది. ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మనదేశంలో చిన్న నదుల వద్ద వంతెనలు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. బయటి ఎక్కువగా ఎండిపోయిన ప్రదేశాల్లో కనిపిస్తుంది. అయితే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మాత్రమే వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు దీనిని బంతులు తయారు చేసేందుకు వాడేవారు.