https://oktelugu.com/

Samantha : నాగ చైతన్య విషయంలో నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది..తప్పు చేశా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్!

శోభిత తో నాగ చైతన్య రహస్య సంబంధం పెట్టుకోవడం వల్లనే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందా..? అని చాలా మంది అనుకుంటున్నారు. రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా సమంత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలను చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 22, 2024 / 03:28 PM IST

    Samantha

    Follow us on

    Samantha :  సోషల్ మీడియా లో సమంత, నాగ చైతన్య పేర్లు తరచూ ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటాయి. కారణం వాళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే అంశం తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరిలో ఉండబట్టే. దానికి తోడు నాగ చైతన్య రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నిశ్చితార్థం చేసుకోవడం తో అసలు విడాకుల విషయం లో తప్పు నాగ చైతన్యదేనా..?, అనే సందేహాలు మొదలయ్యాయి. కారణం నాగ చైతన్య విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే శోభిత దూళిపాళ్లతో తిరుగుతూ కనిపించాడు. అంతే కాదు అనేక ప్రైవేట్ పార్టీలలో కూడా వీళ్ళు కలిసి పార్టీ చేసుకోవడం, వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో రావడం వంటివి జరిగాయి. స్నేహితులు అయ్యుండొచ్చేమో అని అనుకున్నారు కానీ, పెళ్లి దాకా వీళ్ళ మ్యాటర్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

    శోభిత తో నాగ చైతన్య రహస్య సంబంధం పెట్టుకోవడం వల్లనే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందా..? అని చాలా మంది అనుకుంటున్నారు. రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా సమంత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలను చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజ్ & డీకే తెరకెక్కించిన ‘సిటాడెల్’ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ హీరోహీరోయిన్లు గా నటించారు. ఇందులో స్పై ఏజెంట్ గా సమంత నటించింది. ట్రైలర్ లో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనమంతా చూసాము. హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి ఇది రీమేక్.

    ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సమంత ఇచ్చిన ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో యాంకర్ సమంత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ చిత్రం లో మీరు స్పై ఏజెంట్ గా నటించారు కదా. నిజ జీవితం లో కూడా అలా నటించారా?’ అని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నిజ జీవితం లో కూడా నేను స్పై గా వ్యవహరించాల్సింది. అలా చేయకుండా తప్పు చేశాను, దాని వల్లే నా జీవితం ఇలా తయారైంది’ అని చెప్పుకొచ్చింది. నిజ జీవితంలో కూడా స్పై అంటే నాగ చైతన్య, శోభిత రహస్య బంధం పై నిఘా పెట్టలేకపోయాను అనే అర్థం వచ్చేలా సమంత ఈ వ్యాఖ్యలు చేసిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరోపక్క శోభిత దూళిపాళ్ల పెళ్లి పనులు చేసుకుంటూ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిన్న వైజాగ్ లో ఆమె పెళ్లి కి ముందు హిందూ సంప్రదాయాలతో జరగాల్సిన కార్యక్రమాల్లో పాల్గొన్నది. వీళ్లిద్దరి వివాహం నవంబర్ లో, లేదా డెసిబెర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనుంది.