https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ చిత్రంతో సరికొత్త ప్రయోగం చేయబోతున్న దిల్ రాజు..తేడా కొడితే ఇక షెడ్డుకే!

ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దిల్ రాజు, ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే, కచ్చితంగా బాగుంటుంది, థియేటర్స్ కి వెళ్లి చూడాలి అని ఆడియన్స్ లో ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ అభిప్రాయం చెరిగిపోయే ప్రమాదం వచ్చింది. 2022 వ సంవత్సరం తర్వాత దిల్ రాజు నిర్మాతగా 10 సినిమాలను నిర్మించాడు. వీటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 22, 2024 / 03:43 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer: టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నైజాం ప్రాంతం లో ఒక్క చిన్న డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమైన ఆయన సినీ కెరీర్, ఆ తర్వాత నిర్మాతగా మారి నితిన్ ని హీరో గా పెట్టి దిల్ అనే చిత్రాన్ని తీసాడు. కమర్షియల్ గా ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆయన పేరు దిల్ రాజు గా మారిపోయింది. ఆ తర్వాత దిల్ రాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తీస్తూ అనతి కాలం లోనే అగ్ర నిర్మాతగా మారిపోయాడు. అప్పుడప్పుడు ఫ్లాప్ సినిమాలు పడేవి కానీ, వాటి నష్టాలను పూడ్చేందుకు వెంటనే రెండు మూడు సూపర్ హిట్స్ పడేవి. ఒక పక్క నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోపక్క పంపిణీదారుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు దిల్ రాజు.

    అలా ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దిల్ రాజు, ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే, కచ్చితంగా బాగుంటుంది, థియేటర్స్ కి వెళ్లి చూడాలి అని ఆడియన్స్ లో ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ అభిప్రాయం చెరిగిపోయే ప్రమాదం వచ్చింది. 2022 వ సంవత్సరం తర్వాత దిల్ రాజు నిర్మాతగా 10 సినిమాలను నిర్మించాడు. వీటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. మిగతావన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. వేరే నిర్మాతకు ఇన్ని ఫ్లాప్స్ పడితే కచ్చితంగా షెడ్డుకి వెళ్ళిపోతాడు. కానీ దిల్ రాజు సమాంతరంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉండడం, క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలను కొని బ్లాక్ బస్టర్స్ హిట్స్ ని అందుకోవడం వల్ల ఆ నష్టాలు పూడాయి. రీసెంట్ గా విడుదలైన ‘దేవర’ చిత్రాన్ని నైజాం ప్రాంతం లో విడుదల చేసింది దిల్ రాజే. అయితే ఇలా డిస్ట్రిబ్యూషన్ ద్వారా లాభాల్లోకి వచ్చిన దిల్ రాజు, ఆ డబ్బు మొత్తాన్ని ‘గేమ్ చేంజర్’ చిత్రం మీదనే పెట్టాడు.

    పెట్టిన ప్రతీ పైసా కి లాభం రావాలంటే సంక్రాంతి సీజన్ మంచి ఛాయస్ గా భావించి జనవరి 10వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ అదే సంక్రాంతి సీజన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న వెంకటేష్- అనిల్ రావిపూడి సినిమాని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. గత సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ ఇలాగే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఒకసారి వర్కౌట్ అయ్యింది కదా, అన్ని సార్లు ఇది వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు, ఒకవేళ గేమ్ చేంజర్ చిత్రానికి ఫ్లాప్ టాక్ వస్తే వెంకటేష్ సినిమాకి కలెక్షన్స్ మొత్తం వెళ్లిపోతాయి. అదే వెంకటేష్ సినిమా లేకుంటే గేమ్ చేంజర్, బాలయ్య సినిమాలు మాత్రమే ఆడియన్స్ ఛాయస్ గా ఉంటాయి. మరి దిల్ రాజు ఏమి చేయబోతున్నాడో చూడాలి, ఏదైనా తేడా జరిగితే మాత్రం ఈసారి ఆయన కోలుకోవడం చాలా కష్టం అని అంటున్నారు విశ్లేషకులు.