https://oktelugu.com/

Child Care Tips: పిల్లలతో ఇలా ఉంటే వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు..

ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉన్నా.. ఇతరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారానే వారికి గుర్తింపు పెరుగుతుంది. స్నేహితులు, బంధువులు ఎక్కువగా ఉన్న వారి జీవితానికి.. ఎటువంటి బంధాలు లేని వారి జీవితాల్లో చాలా తేడాలు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : December 6, 2023 / 09:43 AM IST

    Child Care Tips

    Follow us on

    Child Care Tips: కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవితం మారిపోయింది. ఒకప్పుడు ఒక పనిని చేయడానికి ఎన్నో ప్రయాసలు పడేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఎటువంటి పనినైనా ఈజీగా చేయగలుగుతున్నారు. అయితే టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ పనులు ఈజీ అవుతున్నా.. కమ్యూనికేషన్ దెబ్బతింటోంది. ప్రతి ఒక్కరూ మొబైల్ యూజ్ చేయడంతో ఎక్కువ సేపు ఫోన్ తోనే గడుపుతున్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో తల్లిదండ్రులు తమ పనులు లేదా కాలక్షేపానికి ఫోన్ ను వాడడంతో పిల్లలతో వారి కమ్యూనికేషన్ ఉండడం లేదు. దీంతో పిల్లలకు ఏదైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులను అడగడం మానేస్తున్నారు. ఫలితంగా వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే…

    ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉన్నా.. ఇతరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారానే వారికి గుర్తింపు పెరుగుతుంది. స్నేహితులు, బంధువులు ఎక్కువగా ఉన్న వారి జీవితానికి.. ఎటువంటి బంధాలు లేని వారి జీవితాల్లో చాలా తేడాలు ఉంటాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. వ్యాపారమైనా.. విహార యాత్రకైనా అందరూ కలిసి వెళ్లేవారు. ఒకరి సమస్యను మరొకరు తెలుపుకొని పరిష్కరించుకునేవారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు గౌరవించడం వంటివి ఇంట్లో జరిగేవి. దీంతో సంబంధాలు మెరుగ్గా ఉండేవి.

    రాను రాను జీవితాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలా మంది చేతితో స్క్రోలింగ్ చేయండం తప్ప ఇతరులతో మాట్లాడడం మానేశారు. ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ విపరీతంగా వస్తోంది. పిల్లల జీవితాల్లో ఒకటి స్కూల్ ప్రభావం.. మరొకటి తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. విద్యాసంస్థల్లో పిల్లలు చదువుతో బిజీగా ఉంటారు. ఇళ్లల్లోకి వచ్చిన తరువాతే వారికి జీవితం గురించి అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో కమ్యూనికేషన్ పెంచుకోవాలి. వారితో ఎక్కువగా మాట్లడుతూ వారి విషయాలు తెలుసుకోవాలి.

    పిల్లలతో ఎక్కువగా మట్లాడడం వల్ల వారు ఎటువంటి సమస్యనైనా తల్లిదండ్రులకు చెబుతారు. దీంతో వారిపై ఒత్తిడి పెరగకుండా ఉండి చదువుపై శ్రద్ధ చూపుతారు. లేకుంటే తమకు ఎవరూ లేరనే భావన కలగడంతో చదువుపై ఫోకస్ చేయరు. పిల్లలకు మొబైల్ కంటే సంబంధాలు ఎక్కువ అని విషయాన్ని తెలియజేయండి. ఒకవేళ ఉద్యోగ రీత్యా మొబైల్ వాడితే వారికి ఆ విషయం చెప్పండి. లేకుంటే మొబైల్ వాడడమే జీవితం అనుకునే భ్రమలో ఉండిపోతారు. తల్లిదండ్రులు కాలక్షేపం సాధ్యమైనంత వరకు పిల్లలతో చేయడం వల్ల వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా వారు జీవితంలో ఎదగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.