TTD: ఆ లడ్డూలు ఏంది? అన్న ప్రసాదం నాణ్యతేది? తిరుమలలో భక్తుల ఆగ్రహం

తిరుమలలో శ్రీవారి నిత్య అన్నదాన నిలయాన్ని 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. దీనిని శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ అంటారు.

Written By: Dharma, Updated On : December 6, 2023 9:29 am

TTD

Follow us on

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులవుతుంటారు. ఇలా వెళ్లినవారు కచ్చితంగా అన్నప్రసాద సముదాయంలో భోజనం చేస్తారు. కానీ ఇటీవల అన్నప్రసాదం నాణ్యత పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా కొందరు భక్తులు నిరసనకు దిగారు. భక్తులకు వడ్డించిన అన్నం బాగోలేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అన్నం పెడతారా? అంటూ నిలదీశారు. దీనిపై స్పందించిన టిటిడి సిబ్బంది ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయమని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తిరుమలలో శ్రీవారి నిత్య అన్నదాన నిలయాన్ని 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. దీనిని శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ అంటారు. 2011 జూలై 7న మరోసారి నూతన అన్నదాన నిర్ణయాన్ని టీటీడీలో ప్రారంభించారు. దీని నిర్మాణానికి సుమారు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ భవనంలోని రెండు అంతస్తులలో నాలుగు పెద్ద భోజనశాలలు ఉన్నాయి. ఒక్కో భోజన శాలలో ఒకేసారి 1000 మంది కూర్చొని తినగలిగే సౌకర్యం ఉంది. ప్రతిరోజు 12 గంటల పాటు అన్నదానం నిర్వహిస్తారు. వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు సగటున 70 వేల మంది భక్తులు అన్నదానం చేయగల సామర్థ్యం ఇక్కడ ఉంది.

అయితే ఇటీవల టీటీడీ అందించే భోజనం పై విమర్శలు వస్తున్నాయి. ఆహార పదార్థాల్లో నాసిరకం కనిపిస్తుండడంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడం విశేషం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో టీటీడీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు భక్తులు అన్న ప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బియ్యంలో నాణ్యత లోపం పై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్న ప్రసాదం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదని వాపోయారు. దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.