Parenting Tips: ఇలా చేయకపోతే తండ్రిని పిల్లలు పట్టించుకోరు..

ఉద్యోగం చేసినా సరే ఇంటికి వచ్చిన తర్వాత వెళ్లే ముందు పిల్లలతో వద్దన్నా తల్లికి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే వారికి స్నానాలు, టిఫిన్ లు, ఫుడ్ వంటి ప్రిపరేషన్ లలో, వారికి తినిపించడంలో కచ్చితంగా పిల్లలతోనే ఉంటుంది తల్లి.

Written By: Swathi, Updated On : May 3, 2024 9:07 am

Parenting Tips

Follow us on

Parenting Tips: పిల్లలను పెంచడం అంటే వారి ఆలనా పాలనా చూసుకోవాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. తల్లిదండ్రుల మాటతీరు, వ్యవహార శైలి పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంటుంది. ఇద్దరు ఎంత హుందాగా ఉంటే పిల్లలు కూడా అంతే హుందాతనం నేర్చుకుంటారు. మీ ఇంట్లో మీ మాట తీరు ఎలా ఉంటే వారు కూడా అదే విధంగా మాట్లాడుతారు. ఇక అమ్మానాన్నలు ఇద్దరు కూడా ఉద్యోగులే అయితే ఆ కుటుంబ వాతావరణం విచిత్రంగానే ఉంటుందని చెప్పాలి. తల్లి కాస్త సమయం కేటాయించినా తండ్రి మాత్రం కష్టమే.

ఉద్యోగం చేసినా సరే ఇంటికి వచ్చిన తర్వాత వెళ్లే ముందు పిల్లలతో వద్దన్నా తల్లికి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే వారికి స్నానాలు, టిఫిన్ లు, ఫుడ్ వంటి ప్రిపరేషన్ లలో, వారికి తినిపించడంలో కచ్చితంగా పిల్లలతోనే ఉంటుంది తల్లి. కానీ తండ్రికి ఈ ఫెసిలిటీ ఉండదు. అందుకే తండ్రి కాస్త తక్కువ సమయం కేటాయిస్తాడు. మరి గుడ్ డాడీ అనిపించుకోవాలంటే మీరు ఏం చేయాలో ఓ సారి చూసేయండి.

ఎంత బిజీగా ఉన్నా సరే మీ సమయంలో కాస్త సమయం పిల్లలకు కేటాయించండి. వారానికి ఒక్కసారి అయినా సరే దగ్గరలో ఉన్న పార్కుకు లేదా మరేదైనా స్థలానికి తీసుకోని వెళ్లండి. దీని కోసం దూరం వెళ్లాల్సిన పనిలేదు. దగ్గరలో ఉన్న మాల్స్ పార్కులు వంటి వాటికి తీసుకొని వెళ్లవచ్చు. తీసుకొని వెళ్లి మీరు ఫోన్ లో బిజీ అయ్యి వారిని ఆడుకొండి అని అలా వదిలేయకండి. పిల్లలతో ఆడుకుంటే, లేదా వాడిని ఆడిస్తుంటేనే వారికి మీకు మంచి రిలేషన్ బాండ్ అవుతుంటుంది. సో జాగ్రత్త.

తండ్రి లక్షణాలు పిల్లలకు వచ్చేస్తుంటాయట. అందుకే తండ్రి పాత్ర చాలా సమర్థవంతంగా ఉండాలి. చెడు వ్యసనాలు, అబద్ధాలు చెప్పడం ఉంటే మానుకోవాలి. చీటికి మాటికి ఆవేశం, కోపం ఉంటే కచ్చితంగా మానుకోవాలి. ఈతరం పిల్లలు చాలా యాక్టివ్ ఉంటున్నారు. వారిని భరించాలంటే ఓపిక ఉండాలి. వారు అడిగే ప్రశ్నలకు నిదానంగా సమాధానం చెప్పండి. వారితో వీలైనంత సమయం గడపండి. కానీ తీరిక లేదని కసురుకుంటే మంచి తండ్రి అనిపించుకోలేరు.