Homeఎంటర్టైన్మెంట్మూవీ రివ్యూSabari Review: శబరి మూవీ ఫుల్ రివ్యూ...

Sabari Review: శబరి మూవీ ఫుల్ రివ్యూ…

Sabari Review: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు వైవిధ్యమైన పాత్రను ఎంచుకొని సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో డిఫరెంట్ పాత్రలను ఎంచుకొని సినిమాలు చేయడం ప్రారంభించింది. ఇక అందులో భాగంగానే క్రాక్ సినిమాలో ‘ జయమ్మ ‘ పాత్ర ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. దాంతో ఇటు తెలుగు, అటు తమిళ్ ఇండస్ట్రీలో చాలా బిజీయేస్ట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ‘శబరి ‘ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది.? వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించిందా.? లేదా అనే విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన భర్త అయిన అరవింద్ ( గణేష్ వెంకట రమణ) నుంచి విడాకులు తీసుకుంటుంది. తన కూతురు అయిన రియా( బేబి నివేక్ష) తో కలిసి సంజన ఒక కొత్త లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇక తన కూతురికి మంచి స్కూల్ ని చదువును అందించాలనే ఉద్దేశ్యంతో తను ముంబై నుంచి విశాఖపట్నం కి చేంజ్ అవుతుంది. ఇక అప్పుడు తన ఫ్రెండ్ ద్వారా తెలిసిన కొన్ని జాబ్ లకి వెళ్లినప్పటికీ అక్కడ తను రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక తన చదువుకి తను కోరుకున్న జాబ్ దొరక్కపోవడంతో ఒక కార్పొరేట్ కంపెనీలో జుంబా డాన్స్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ గా ఒక ఉద్యోగం అయితే సంపాదిస్తుంది.

ఇక తను అక్కడి నుంచి సిటీ ఔట్ కట్స్ లో ఉన్న ఒక ఫారెస్ట్ లో ఉండే ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి సూర్య అనే ఒక వ్యక్తి తనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తను ఆయన నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. తను సంజన ను ఎందుకు చంపాలనుకున్నాడు. అరవింద్ కి సంజనకి మధ్య కలిగిన ఇబ్బందులు ఏంటి ఎందువల్ల వాళ్ళు విడిపోయారు. వీళ్ళ విడాకులుకు వాళ్ళ కూతురు అయిన రియాకి కి మధ్య సంబంధం ఏంటి.? సూర్య ఎందుకు సంజనను చంపాలనుకుంటున్నాడు.? అనే విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ అనిల్ కట్జ్ ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు . ఇక అందుకు తగ్గట్టుగానే ప్రతి సీన్ లో ఏదో ఒక కంటెంట్ అయితే చెప్పే ప్రయత్నం తను చేశాడు.ఇక ముఖ్యంగా ఆయన రాసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంది. అయితే ఈ సినిమా ద్వారా దర్శకుడు అనిల్ చాలా వరకు సినిమాను ఎంగేజింగ్ తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కొన్నిచోట్ల లాజిక్కులు అనేవి మిస్ అవ్వడం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి అక్కడక్కడ కొంచెం కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే ఈ సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ సీన్స్ ను హ్యాండిల్ చేయడం లో డైరెక్టర్ కొంతవరకు తడబడ్డడనే చెప్పాలి.

ఎందుకంటే డైరెక్టర్ కి అనుభవం లేని తనం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ప్రతి సీన్ ని తాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఆయన తడబడ్డాడు. ఇక గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లని ఎలివేట్ చేయడం చాలా వరకు ప్లస్ అయింది. దానికి తగ్గట్టుగానే కొన్ని ట్విస్టు లు కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది. అలాగే ప్రేక్షకుడిని థ్రిల్ చేయడంలో కూడా చాలా వరకు సక్సెస్ సాధించారు…అయితే స్క్రీన్ ప్లే లో కొంత వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసిందనే చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి సీన్ లో తను నటించిన నటన గాని, చూపించిన వైవిధ్యం గానీ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక ఇంతకుముందు తను కొన్ని సినిమాల్లో నెగిటివ్ పాత్రలు పోషించినప్పటికి ఆ పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో కూడా బెస్ట్ యాక్టింగ్ ని కనబరిచి సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో తను కొద్ది వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి…ఇక అరవింద్ క్యారెక్టర్ ను పోషించిన వెంకట రామణ తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించాడు. సూర్య క్యారెక్టర్ లో నటించిన మైమ్ గోపి కూడా తనదైన రీతిలో తన పాత్రలో ఉన్న వేరియేషన్స్ ని చాలా బాగా అటెంప్ట్ చేశాడు… ఇక మొత్తానికైతే ఆర్టిస్టులందరూ కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాని మరొక మెట్టు పైకి ఎక్కించడం లో వాళ్లు చాలా వరకు కృషి చేశారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా సస్పెన్స్ కొనసాగించే సీన్లలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి… ఇక సినిమాటోగ్రాఫర్ అయిన నాని చమిడి శెట్టి అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలావరకు బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

వరలక్ష్మి శరత్ కుమార్..
కొన్ని ఎమోషన్ సీన్స్…
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్…

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే, డైరెక్షన్
కొన్ని లాజిక్ లేని సీన్లు…

రేటింగ్

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్

సస్పస్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఒక్కసారి చూడొచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version