Thyroid: మన శరీరంలోని అవయవాలు బాగా పని చేయడానికి థైరాయిడ్ హార్మోన్లు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సరైన సమయంలో విడుదలైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే కొన్ని లక్షణాలు థైరాయిడ్ కు సంకేతాలు అని చెప్పవచ్చు. ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకుని మందులు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
థైరాయిడ్ ఉన్నవాళ్లలో కనిపించే లక్షణాలలో ఆకలి లేకపోవడం ఒకటి. సమయానికి తినకపోయినా ఆకలిగా అనిపించడం లేదంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. హార్ట్ రేట్ అదే పనిగా పెరుగుతుంటే కూడా థైరాయిడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రీజన్ లేకుండా తరచూ మూడ్ మారిపోతుంటే కూడా థైరాయిడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పవచ్చు.
థైరాయిడ్ గ్రంథి పెరిగితే గొంతు దగ్గర వాపు వస్తుంది. చికిత్స తీసుకోని వాళ్లకు థైరాయిడ్ గ్రంథి పెరుగుతుందని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. క్యాబేజ్, నట్స్ తీసుకున్న సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే కూడా థైరాయిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. బరువు పెరిగితే హైపోథైరాయిడిజం బరువు తగ్గితే హైపర్‌థైరాయిడిజంగా భావించాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
థైరాయిడ్ తో బాధ పడేవాళ్లను డయేరియా లేక మలబద్ధకంతో పాటు కడుపు ఉబ్బరం ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. థైరాయిడ్ సమస్య ఉందని అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.