PRC Controversy: ముదిరిన పీఆర్సీ వివాదం.. తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు.. సర్కారు ప్రతిస్పందన ఇదే..!

PRC Controversy: ఏపీలో పీఆర్సీ వివాదం రోజురోజుకూ ఇంకా పెరుగుతోంది. ఈ విషయంలో అటు ఉద్యోగులు కాని ఇటు ప్రభుత్వం కాని ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. మరో వైపున ఆ జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులపై చర్యలకు కూడా ఏపీ సర్కారు వెనుకాడటం లేదని తెలుస్తోంది. తమ నిర్ణయానికి సహకరించని ఉద్యోగులపై చర్యలకు ఏపీ సర్కారు సిద్ధమవుతున్నట్లు […]

Written By: Mallesh, Updated On : January 30, 2022 8:45 pm
Follow us on

PRC Controversy: ఏపీలో పీఆర్సీ వివాదం రోజురోజుకూ ఇంకా పెరుగుతోంది. ఈ విషయంలో అటు ఉద్యోగులు కాని ఇటు ప్రభుత్వం కాని ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. మరో వైపున ఆ జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులపై చర్యలకు కూడా ఏపీ సర్కారు వెనుకాడటం లేదని తెలుస్తోంది.

AP CM Jagan

తమ నిర్ణయానికి సహకరించని ఉద్యోగులపై చర్యలకు ఏపీ సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఈ నెల 29 సాయంత్రం 6 గంటలలోపు వేతనాల బిల్లులు సమర్పించని వారిపైన క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులిచ్చారు.

వేతనాల చెల్లింపులపైన ఏయే రోజుల్లో ఏయే ప్రక్రియలు స్టార్ట్ చేయాలి, పూర్తి చేయాలనే విషయమై డీడీవోలు, ఎస్టీవోలకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. అయినా ఆ పనులు పూర్తి చేయలేదని తెలుస్తోంది. కాగా, అలా వేతనాలు చెల్లించే ప్రక్రియను నిర్వర్తించని వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని, ఇందుకు బాధ్యులైన వారికిపై సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ట్రెజరీ డైరెక్టర్, పే అకౌంట్స్ సంబంధిత అధికారులకు నిర్దేశించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా ప్రభుత్వం ఉద్యోగులపైన ఏమాత్రం కనికరం చూపించకుండా తన రియాక్షన్ చెప్తోంది. ఈనెల 28 సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల వేతనాల బిల్లులు ప్రాసెస్ అయ్యాయి. ఈనెల 29న మరో ఏడువేల బిల్లులు ప్రాసెస్ అయినట్లు సమాచారం.

AP Employees strike

ఇకపోతే ఉద్యోగుల పాత వేతనాలే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ఇవ్వాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు తహసీల్దార్లు ఈ మేరకు కలెక్టర్లకు లెటర్స్ రాస్తున్నారు. ఉద్యోగులందరూ కొత్త వేతనాలను వ్యతిరేకిస్తున్నారని, ఈ మేరకు వారు వినతి పత్రాలను సమర్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పీఆర్సీ ద్వారా తక్కువ వేతనం వస్తున్నదని, ఏపీ సర్కారు ఈ విషయమై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసులిచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. చూడాలి మరి.. చివరకు ఏం జరుగుతుందో. .

Tags