Five Bad Habits : మనం జీవితంలో ఎదగాలని ఎన్నో కలలు కంటాం. అందుకు అనుగుణంగానే మన పని కూడా ఉండాలని కోరుకుంటాం. ఎంత కష్టమైనా సరే జీవితంలో మంచి స్థానానికి ఎదగాలనే ఆశ ఉండటం సహజమే. కానీ మనం ఎదగడానికి తగిన దారులు కూడా ఉండాలి. మనం అనుకుంటే ఎదగం. కష్టపడి పనిచేస్తే ఎదుగుతాం. మనం చేసే కష్టంతో పాటు కలిసి వస్తేనే ఎదుగుతాం. లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారవుతుంది. మనం ఎదగకుండా చేసేవి కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

బద్దకం
రామాయణంలో రాముడు రావణాసురుడిని అడుగుతాడు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలని. దానికి అతడు చెప్పే సమాధానం రేపు చేసే పని ఈ రోజే చేయాలి. ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. అంటే మనిషికి బద్ధకం ఉండకూడదు. సోమరితనంతో ఉండేవాడు జీవితంలో ఎదగలేవుడు. అక్కడే ఉంటాడు. తన తెలివితేటలకు పని చెప్పడు. ఏ పని చేయకుండా ఉంటే జీవితంలో ముందుకెళ్లడం కష్టమే.

మద్యపానం
మద్యపానం అలవాటు ఉన్న వ్యక్తి సంపదను ఖర్చ చేస్తుంటాడు. రోజు తాగడం వల్ల డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. దీంతో జీవితంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశం కాస్త నీరుగారి పోతుంది. అందుకే మద్యపానం అలవాటు ఉన్న వ్యక్తి కూడా ఎదిగేందుకు ఆస్కారం లేదు. మద్యానికి దూరంగా ఉంటేనే జీవితంలో అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి వీలవుతుంది.

వివాహేతర సంబంధం
వివాహేతర సంబంధాలు ఉన్న వాడు కూడా ఎదగలేడు. పరస్త్రీ వ్యామోహంలో పడితే ధనం విపరీతంగా ఖర్చవుతుంది. ఆమెను సంతోషపెట్టే క్రమంలో అతడి సంపాదన కరుగుతుంది. దీంతో ఈ అలవాటు ఉన్నవాడు కూడా జీవితంలో ఎదగడం కష్టమే. బాగా డబ్బు సంపాదించాలంటే అక్రమ సంబంధాలు ఉండకూడదు. వీటితో కూడా ప్రమాదకరమే.

పగటి నిద్ర
కొందరు మధ్యాహ్నం సమయంలో బాగా నిద్ర పోతారు. ఇది బద్ధకమే. ఎందుకంటే పగటి నిద్ర పనికి రాదనే మనకు కుందేలు, తాబేలు కథే చెబుతుంది. జీవితంలో ఎదగాలనుకునే వాడు అహర్నిశలు శ్రమిస్తాడు. పగటి పూట ఆదమరిచి నిద్ర పోతే ఇక పనులు ఎలా సాగుతాయి. దీంతో మనిషి ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది.

పేకాట
పేకాట అత్యంత ప్రమాకరమైనది. పాండవులు కూడా ఇదే విధంగా జూదం ఆడి పన్నెండేళ్లు వనవాసం చేశారు. జూదం నీచమైనది. దాని బారిన పడితే అంతే. మన పతనాన్ని మనమే కొనితెచ్చుకోవడం. ఇలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలి. లేదంటే నీ కుటుంబాన్నే దహిస్తుంది. పేకాటతో కుటుంబాలే నాశనం అయ్యాయి. ఈ అలవాటు ఉంటే కూడా జీవితంలో ఎదగడం సాధ్యం కాదు.