Husband And Wife Relationship: సృష్టిలో అందమైనది దాంపత్య జీవితం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహం అనే బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి ఉంటారు. ఇలా ఒక్కటైన వారు కలకాలం కలిసి ఉంటారు. పూర్వ కాలంలో అమ్మాయి, అబ్బాయి మోహం చూపించకుండానే పెళ్లిళ్లు చేసేవారు. పెద్దలు చెప్పిన విధంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ దాంపత్య జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెద్దలు వివాహాన్ని కుదిర్చితే.. ఇప్పుడు పెళ్లి కాకుండానే కొన్నాళ్లపాటు కలిసుండే రోజులు వచ్చాయి. అయితే ప్రేమ ఉన్న చోట దాంపత్య జీవితం నిలబడుతుందంటారు. ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకుంటున్నాయి. అలాగే అమ్మాయిలు, అబ్బాయిల కొరత కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇలాంటి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవదా?
కొన్నేళ్ల కిందట విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలా పెళ్లిళ్లు చేసుకొని అలా విడాకులు తెచ్చుకుంటున్నారు. అయితే ఎక్కువ శాతం విడాకులు తీసుకునేవారిలో ఏజ్ డిఫరెంట్ ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో వీరు కలిసి ఉండలేరని తెలిపింది. సాధారణంగా పెళ్లి చేసుకునే వారు అమ్మాయి 21 సంవత్సరాలు పైబి, అబ్బాయి 25 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. కానీ ప్రేమ కారణంగా కొందరు ఈ వయసులోపే వారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు సరైన వయసులో పెళ్లిళ్లు చేసుకున్నా.. ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఎక్కువగా ఉంటుంది.
దంపతుల మధ్య వయసు భారీగా తేడా ఉండడం వల్ల ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోలేరని అధ్యయనంలో పేర్కొన్నారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలో ఎవరి వయసు ఎక్కువగా ఉండి భాగస్వామి వయసు తక్కువగా ఉండడం వల్ల భావాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. దీంతో కలిసి ఉండడాని కంటే విడిపోవడమే బెటరని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోలేక విడాకుల వరకు వెళ్తున్నారు. ఇటీవల విడాకులు తీసుకున్న వారిలో ఎక్కువ శాతం ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్లేనని సర్వేలో పేర్కొన్నారు.
అయితే చాలా మంది ప్రేమ ఉన్న చోట వయసుతో సంబంధం లేదని అంటున్నారు. అయితే వయసులో తేడా ఉండడంతో కొన్ని విషయాల్లో వీరి మధ్య ప్రేమ మాయమవుతుంది. ఏజ్ ఎక్కువగా ఉన్నవారి ఆలోచనలు కాస్త దూకుడుగా ఉంటాయి. వీరిని అందుకోవడానికి తక్కువ వయసు ఉన్నవారు వెనుకబడిపోతున్నారు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కారణంగా దూరంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని అధ్యయనం తెలిపింది.