Identify Genuine Love Signs: సమాజంలో మనుషులు రకరకాల మనస్తత్వాలతో కలిగి ఉంటారు. వీరిలో కొందరు ఆప్యాయ తతో ఉంటారు.. మరికొందరు నిత్యం కోపంతో రగిలిపోతూ ఉంటారు. అయితే చాలామంది కోరుకునేది ఎదుటివారి నుంచి ప్రేమ మాత్రమే. ఆప్యాయంగా పలకరించడం.. మంచి మాటలను వినాలని అనుకోవడం.. అవసరమైన సమయంలో ఆదుకోవడం.. వంటివి కావాలని కోరుకుంటారు. కానీ కొందరు పైకి ప్రేమతో ఉన్నట్లు నటిస్తూనే లోలోపల మాత్రం వేరే క్యారెక్టర్ తో కలిగి ఉంటారు. అయితే ఎదుటివారు మనపై నిజమైన ప్రేమను చూపిస్తున్నారని ఎలా తెలుసుకోవాలి? వారి చూపించే ప్రేమ స్వచ్ఛమైనదా? కాదా అని ఎలా గుర్తించాలి?
Also Read: Love symbol : లవ్ సింబల్ చరిత్ర ఏంటి? నిజమైన హృదయాకారంలో ఇది ఎందుకు లేదు?
భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటేనే వారి జీవితం బాగుంటుంది. ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుపుచ్చుకోవడం.. ఒకరి అవసరాలను మరొకరు తీర్చడం.. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటివి చేసుకోవాలి. అయితే అన్ని సమయాలు ఒకేలా ఉండవు. కొన్ని సందర్భాల్లో దంపతుల మధ్య విభేదాలు రావచ్చు. అయితే ఈ విభేదాలను ఎక్కువగా కొనసాగించకుండా వెంటనే మరోసారి ప్రేమతో పలకరించడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కానీ ఇలాంటి సమయంలోనే కొందరు ద్వేషాన్ని మరింతగా పెంచుకొని ఎదుటివారిపై పగతో రగిలిపోతూ ఉంటారు. ఇలాంటివారు ఒకరకమైతే.. మరికొందరు పైకి ప్రేమగా నటిస్తూనే లోలోపల విషంతో కలిగి ఉంటారు. మరి ఇలాంటి సమయంలో ఆ వ్యక్తి ప్రేమ చూపిస్తున్నట్లు ఎలా అనుకోవాలి?
ప్రేమ చూపించడం అంటే ఎదుటివారిని పొగడడం కాదు.. వారికి అవసరం లేని వస్తువులను కొనివ్వడం కాదు.. అసలైన ప్రేమ ఎప్పుడూ కనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తికి ప్రేమ అవసరం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆప్యాయతతో కలిగి ఉంటే అప్పుడు నిజమైన ప్రేమ చూపిస్తున్నట్లు గుర్తించుకోవాలి. తప్పు ఎవరైనా చేస్తారు.. కానీ కొందరు చేసే తప్పులను నిందిస్తూ వారిని మరింతగా కృంగింప చేస్తూ బాధ పెట్టడం కంటే.. ఆ తప్పు ఎలా చేయాల్సి వచ్చిందో తెలుసుకొని.. మరోసారి ఆ తప్పు చేయకుండా వారికి అవసరమైన సూచనలు ఇస్తూ.. ఆ సమయంలో వారికి ధైర్యంగా ఉంటూ.. అండగా ఉన్నవారే నిజమైన ప్రేమను చూపించినట్లు అనుకోవాలి.
Also Read: What Is Love: ప్రేమంటే బంధమా? బంధనమా?
ఒక వ్యక్తి పై ప్రేమ ఉంటే ఆ వ్యక్తి ఎలాంటి సమయంలో ఉన్న వారి కోసం ఏదైనా చేయాలనిపించే వ్యక్తి నిజమైన ప్రేమను చూపిస్తున్నట్లే అనుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యక్తి డబ్బు ఉన్నవాడా? లేదా తెలివి ఉన్నవాడా? అని కాకుండా అతని మంచి మనసును తెలుసుకొని వారికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా వారి మనసు తృప్తి పడుతుందని గ్రహిస్తే అప్పుడు నిజమైన ప్రేమను చూపిస్తున్నట్లు అనుకోవాలి. అంతేగాని పైకి ఒకలాగా.. లోపల మరోలాగా ఉంటూ ఎదుటివారిని నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా దంపతుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడే వారి జీవితం ఎప్పటికీ బాగుంటుందని చెబుతుంటారు.