Hari Hara Veera Mallu vs Indra: ఎన్నో వాయుదాలా తర్వాత మరోసారి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ డేట్ ని నేడు ఉదయం ప్రకటించారు ఆ సినిమా మేకర్స్. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల సహనానికి నిజంగా దండం పెట్టాల్సిందే. ఇదే స్థానం లో వేరే హీరో సినిమా ఉండుంటే, వాళ్ళ అభిమానులు ఈ రేంజ్ లో సపోర్ట్ చేసి ఉండేవారా అంటే డౌటే. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మేకర్స్ ఎన్ని సార్లు నిరాశపర్చినప్పటికీ కూడా చాలా సహనం వహిస్తూ ఈ సినిమాని తమ భుజాల పై మోస్తున్నారు. వచ్చే నెల 24 వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే జులై నెల మెగా అభిమానులకు గోల్డెన్ నెల అని చెప్పొచ్చు.
ఇదే జులై 24న మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఇంద్ర’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా అప్పట్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలా పడిన మెగాస్టార్ చిరంజీవి, ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని అందుకొని అభిమానుల జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోయే బ్లాక్ బస్టర్ గా నిలిపాడు. ఇదే తేదీన పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం 1998 వ సంవత్సరం లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు ముందు వరకు పవన్ కళ్యాణ్ కేవలం ఒక చిరంజీవి తమ్ముడు మాత్రమే. కానీ ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు. విపరీతమైన యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక సెలబ్రేషన్ లాంటిది.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు జులై 23 వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్. ఇలా మెగా అభిమానులకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిన నెల ఇది . అలాంటి నెలలో ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల అవుతుండడంతో కచ్చితంగా ఈ చిత్రం అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే నిర్మాత రెగ్యులర్ గా సినిమాలు తీసేవాడు కాదు. సినిమాల మీద విపరీతమైన ఇష్టంతో, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఈ చిత్రం పై వందల కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టాడు. దానికి తగ్గ రాబడి రాకుంటే ఆ నిర్మాత పరిస్థితి అత్యంత దయనీయంగా మారే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు వాయిదా పడడం వల్ల ఈ సినిమాకు హైప్ బాగా తగ్గిపోయింది. ట్రైలర్ నుండి హైప్ పెరుగుతుంది అనే ఆశతో అభిమానులు ఉన్నారు.
July 24th, 1998 – Toliprema
July 24th, 2002 – Indra[Special Mention]
July 23rd, 1987 – Pasivadi PranamNow, July 24th, 2025:#HariHaraVeeraMallu ⏳ pic.twitter.com/T182dzvLpA
— Teja (@Teja01_PSPK) June 21, 2025