MCLR Home Loan Interest Rate: బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఈ మేరకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడంతో రుణాలు తీసుకునే వారికి ఇకపై భారం పెరగనుంది. కస్టమర్లకు కష్టాలు తప్పేలా లేవు. బ్యాంకులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వడ్డీ రేట్లు పెంచుతుండటంతో మార్జినల్ కాస్ట్ ఆఫ్ బేస్డ్ లెండింగ్ రేట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇలా వడ్డీ రేట్లు పెంచడంపై కస్టమర్లలో భయాందోళన ఏర్పడుతోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 30 బేస్డ్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 15 పాయింట్లు పెంచేందుకు నిర్ణయించింది. రెండు బ్యాంకులు తీసుకున్న నిర్ణయంతో రుణం తీసుకునే వారిపై ప్రభావం చూపనుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారు, ఇప్పటికే తీసుకున్న వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వడ్డీ భారం పెరిగిపోతుండగా కొత్తగా రేట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులపై పెను ప్రభావమే పడనుంది.
పెంచిన వడ్డీ రేట్లు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పీఎస్ బీ రేట్లు గమనిస్తే ఎంసీఎల్ ఆర్ రేటు 8.05 శాతానికి చేరడం గమనార్హం. గతంలో ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం ఉండేది. 7.4 శాతం ఉన్న రేటు 8.35 శాతానికి చేరడంతో ఈఎంఐలు కట్టే వారికి కూడా భారం కానుంది. ఎంసీఎల్ఆర్ రేటు నిర్ణయించడానికి ప్రామాణికంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల టెన్యూర్ లోని 30 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతానికి పెంచింది. ఇది వరకు 7.8 శాతం ఉండేది. ఇతర బ్యాంకుల ఎంసీఎల్ఆర్ రేట్లు గమనిస్తే 10 బేసిక్ పాయింట్లు పెంచాయి. వడ్డీ రేట్లు 7.05 శాతం నుంచి 8.1 శాతానికి పెరగడం గమనార్హం. ఇకపై బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే భయం కలుగుతోంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది. వడ్డీ రేట్లు ఇలా పెరగడంతో వినియోగదారులకు ఆందోళన కలుగుతోంది. పెంచిన రేట్లతో ఈఎంఐలు కూడా భారం కానున్నాయి. ఇలా పెంచితే ప్రజలు బ్యాంకులపై కూడా మంచి అభిప్రాయాలు కలగడం లేదు. ఇష్టారాజ్యంగా వడ్డీ రేట్లు పెంచితే ఎలాగనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.