Ariyana Glory: యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఎందరో భామలు ఆ తరువాత స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. అనసూయ, రష్మీగౌతమ్ లతో పాటు విష్ణుప్రియ కూడా స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి దారిలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ. ఒక్క వీడియోతో ఈ భామ ఎవరో అందరికీ తెలిసిపోయింది. టీవీషోల్లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చినా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన తరువాత అరియానా ఫేమస్ అయిపోయింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మన్ననలు పొందింది. అరియాలో టీవీ షోలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం నిత్యం ఫాలో అవుతూ ఉంటుంది. తనకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోస్ ను పెట్టి ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన తరువాత అరియానా గ్లోరీ పాపులర్ అయింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఆ తరువాత స్టార్ కామెడీ లాంటి షోల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఓ వైపు టీవీ షోల్లో కనిపిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూ ఉంటుందీ ముద్దుగుమ్మ. తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ అలరిస్తోంది. అభిమానులు అడిగిన ప్రతీ ప్రశ్నకు అరియానా స్పందించడం విశేషం. అందుకే ఆమెకు విపరీత ఫాలోయింగ్ పెరిగింది.
ఇక ఈ భామ ట్రెండ్ కు తగిన డ్రెస్సులు మారుస్తూ కుర్రకారులో జోష్ పెంచుతుంది. తాజాగా ఎల్లో గౌన్ ధరించి హాట్ ఫొటో షూట్ కు ఫోజులచ్చింది. నడుమును అటూ ఇటూ తిప్పుతూ అందాలను ఆరబోసింది. కుర్రకారుకు మత్తెక్కించేలా ఉన్న ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ గా మారాయి. అంతేకాకుండా వీటిని చూసిన నెటిజన్లు కామెంట్ల వరద పారిస్తున్నారు. అమ్మడుకు కొత్తగా ఏమైంది ఇలా ఫోజులిస్తుంది..? అని కొందరు కామెంట్స్ పెట్టారు.

బుల్లితెర రారాణిగా పేరొందిన ఈ భామ తన స్వీట్ వాయిస్ తో యాంకరింగ్ చేసి ఆకట్టుకుంటుంది. అయితే ఆమె గోల్ సినిమాలని ఓ సందర్భంలో చెప్పింది. సినిమాల్లో అవకాశాలు రావడానికి తెగ కష్టపడుతుంది. ఇప్పటి వరకు యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మీ తదితరులు సినిమాల్లో బిజీగా మారారు. తాను కూడా వారిలాగే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకొని హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోవాలని కలలు కంటోంది. అయితే ఈ భామ కలలు ఎన్నడు సాకారం అవుతుందోనని కొందరు ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.