Husband Wife Relationship Tips: జీవిత భాగస్వామి మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే మీరు కలిసి ఉండటానికి మా వంతు సహాయం ఈ ఆర్టికల్స్ ద్వారా చేస్తున్నాము. పార్టనర్ ఫేస్ లో చిరునవ్వు చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. మన ఫేస్ లో కంటే కూడా మన అర్దభాగి ఫేస్ వెలిగిపోతుంటే భలే ఆనందం వేస్తుంది. అంతేకదండీ బాబు.. వాళ్లు హ్యాపీగా ఉంటే మనం సంతోషమే. మన ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ కదా. అన్ని చింతలు తొలగిపోతాయి. అయితే, వారిని సంతోషపెట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు, ప్రేమతో నిండిన మీ కొన్ని నిజాయితీ ప్రయత్నాలు వారిని ఫుల్ హ్యాపీగా చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా అవేంటో చూసేయండి. జర పాటించండి కూడా..
మార్నింగ్ లవ్
ప్రేమపూర్వకమైన, విశ్రాంతినిచ్చే వాతావరణంలో ఉదయాన్ని స్టార్ట్ చేయండి. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కిచెన్ లోకి వెళ్లి వారికి ఇష్టమైన ఓ కప్పు టీ లేదా కాఫీ తయారు చేసి ప్రేమగా ఒక ముద్దు పెట్టి లేపితే వావ్ ఆ డే ఎంత సూపర్ గా గడిచిపోతుందో.. కిచెన్ కు వెళ్లే సాహసం మీరు చేయకపోతే జస్ట్ ప్రేమపూర్వకమైన మాటలతో వారిని మంచం మీద నుంచి లేపండి. అంతే ఎక్కడ ఉన్న రోజు మొత్తం మీరే వారికి గుర్తు వస్తారు. భార్య అయినా భర్త అయినా ఎవరికి అయినా సరే ఈ టిప్ బాగుంటుంది.
ఓ గిఫ్ట్
వారికి ఇష్టమైన పువ్వులు, చాక్లెట్లు లేదా అందమైన నోట్ వంటి చిన్న చిన్న ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వండి. బంగారం, వెండి మాత్రమే కాదు బహుమతులు అంటే.. ఓ చిన్న రోజా తెచ్చి మీ రాణికి ఇచ్చి జడలో పెట్టండి. మురిసిపోతుంది. భార్యలు అయితే మీ రాజాకు తన షర్ట్, పాయింట్ లు తెచ్చి బటన్స్ పెట్టండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? ట్రై చేస్తే కద తెలిసేది. చేసేయండి.
ప్రశంసలు
వారి చిన్న చిన్న విజయాలు, ప్రయత్నాలను గుర్తించండి. ఇంటి పని అయినా, ఆఫీసు ప్రాజెక్ట్ అయినా, లేదా వారు తమను తాము చూసుకునే విధానం అయినా, వారిని కాస్త పొగడండి బాస్. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు అని గాల్లో తేలుతుంటారు.
కాస్త సమయం ఇవ్వాలి కదా..
రోజులోని హడావిడి నుంచి కొంత సమయం కేటాయించి, ఒకరితో ఒకరు సమయం గడపండి. కలిసి వంట చేసుకోండి, పుస్తకం చదవండి లేదా నడకకు వెళ్లండి. అప్పుడే కదా మీరు ఇద్దరు కలిసి ఉంటున్నట్టు మీ ఇద్దరికీ గుర్తు ఉండేది.
ఇంతకీ మీరు వింటారా?
వినడం ఒక గొప్ప కళ. వారు తమ కథను చెప్పేటప్పుడు, పూర్తి శ్రద్ధతో, ఓపికతో వినండి. అది వారి సమస్యలు అయినా లేదా వారి రోజు సంఘటనలు అయినా, మీ మద్దతు వారికి ఓదార్పునిస్తుంది.
కాస్త హెల్ప్ కూడా..
బట్టలు ఉతకడం, వంట చేయడం లేదా పిల్లలను చూసుకోవడం వంటి ఇంటి పనులలో సహాయం చేయండి. ఇది వారి అలసటను తగ్గించడమే కాకుండా, మీరు వారిపై శ్రద్ధ చూపుతున్నారని కూడా చూపిస్తుంది. ఏదైనా సరే కాస్త హెల్ప్ చేస్తే కాస్త ఊరట, విశ్రాంతి లభిస్తుంది. ఆ టైమ్ మీకు కేటాయిస్తారు. మీ గురించే ఆలోచిస్తారు. నా వైఫ్ నాకు హెల్ప్ చేస్తుంది అని లేదా నా భర్త నాకు సహాయం చేశారు అని గుర్తు చేసుకుంటారు.
మసాజ్ కూడా మస్ట్
అలసిపోయిన రోజు చివరిలో మంచి మసాజ్ చేయడం వల్ల వారు రిలాక్స్‌గా ఉండటమే కాకుండా మీ బంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది. అలిసిపోయివచ్చిన భర్తకు మసాజ్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా. మీ ఒడిలో పడుకోబెట్టుకొని హెడ్ మసాజ్ చేయండి. హాయిగా నిద్రపోతారు. ఓయ్ భార్యామణి నీకో రహస్యం చెప్పనా.. రాత్రి పడుకునే ముందు నీ చేయి తన తలకు తగలకపోతే నీ భర్తకు నిద్ర కూడా రాదు. అది నీ మృదువైన చేతుల్లోనే ఉంది. మరి ఓ సారి ట్రై చేస్తావా? ఓయ్ ఓయ్.. మామూలుగా కాదు. కాస్త ప్రేమగా చేయు సరేనా..
ఫుడ్ పెట్టాలి కదా..
వంటగదిలో కొంత సమయం గడపండి. అతనికి/ఆమెకు ఇష్టమైన వంటకం చేయండి. కడుపు నిండా మంచి టేస్టీ ఇష్టమైన భోజనం తింటే ఇంటి మీదనే ధ్యాస ఉంటుంది. ఇవాల నా భార్య ఏం వంట చేసిందా అని థింక్ చేస్తాడు మేడం మీ ఆయన.
ఓ ట్రిప్ కు వెళ్లచ్చు కదా
వారి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, వారికి ఇష్టమైన ప్రదేశంలో డ్రైవ్, పార్క్ లేదా డిన్నర్ వంటి చిన్న విహారయాత్రను ప్లాన్ చేసుకోండి. ఖర్చు అవసరం లేదు. వారంలో ఒకసారి ఓ మూవీ లేదా టెంపుల్, మార్కెట్ అలా ప్లాన్ చేసుకోవాలి. లేదా జీవితం అయిపోతూనే ఉంటుంది. ఇది వారిని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. వారిని సంతోషంగా ఉంచుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.