Husband Test Goes To Viral
Husband Test: ఒక అమ్మాయి తనతో జీవితాంతం నడిచే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ఎదుటి వ్యక్తిని పరీక్షిస్తుంది. మంచివాడా? లేదా మూర్ఖుడా? అనే క్యారెక్టర్ ను తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు ఆ వ్యక్తికి తెలియకుండానే పెడుతుంది. అయితే లేటేస్ట్ గా చాలా మంది అమ్మాయిలు తమ భాయ్ ఫ్రెండ్ తనకు సరైన జోడి అని తెలుసుకోవడానికి ‘హస్బెంట్ టెస్ట్’ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలిపిసిపోతుందని, తద్వారా అతనితో జీవితాన్ని పంచుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. విదేశాల్లో మొదలై మనదేశంలోకి వస్తున్న ఈ ‘హస్బెంట్ టెస్ట్’ ను ఎలా నిర్వహిస్తారు? ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైంది?
సోషల్ మీడియాలో ఇటీవల ‘హస్బెండ్ టెస్ట్’ ట్రెండీగా మారుతుంది. నేటి కాలం అమ్మాయిలో ఒక వ్యక్తి ప్రేమలో పడినప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనతో జీవితాంతం నడిచే వ్యక్తి అని నిర్దారించుకున్న తరువాతే ఆతనితో ముందడుగు వేస్తున్నారు. అయితే హస్పెండ్ టెస్ట్ ద్వారా మరింత ఈజీగా ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ తెలిసిపోతుందన్న చర్చ సాగుతోంది. ఈ టెస్ట్ ను ఇప్పటికే విదేశాల్లో ప్రారంభించారు.
కెంజి గ్రీన్ అనే మహిళ ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే తనతో జీవితాంత కలిసి ఉండడానికి నిర్ణయించకుంది. మరి ఆ వ్యక్తి మంచివాడా? జీవితాంతం తనతో కలిసి ఉంటాడా? కుటుంబ సభ్యులను ప్రేమిస్తారా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో తన ప్రియుడిని ‘హస్బెండ్’ అని పిలుస్తుంది. ఆమె హస్బెండ్ అని పిలవగానే ప్రియుడు నవ్వుతూ లేదా సానుకూలంగా స్పందించకుండా ‘నేను నీ భర్తను కాదు.. నన్ను అలా పిలవొద్దు’ అని చెప్పాడు. దీంతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి అయితే ఈ చిన్న మాటకు అంత రియాక్ట్ అవుతారా? అని నిర్ణయించుకొని అతడిని వదిలేసింది.
ఇది బాగా నచ్చడంతో కొంత మంది అమ్మాయిలు ఇదే ఫాలో అవుతున్నారు. తాము ప్రేమించే వ్యక్తులను ‘హస్బెండ్’ అని పిలుస్తున్నారు. వారి రియాక్షన్ బట్టి వారితో కలిసుండాలా? లేదా? అని నిర్ణయించుకుంటున్నారు. హస్బెండ్ అని పిలిచినప్పుడు సానుకూలంగా స్పందిస్తే కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటాడని, కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుంటారని అంటున్నారు. అలా పిలవొద్దు అని చెబుతున్నారంటే ఆ వ్యక్తి తాత్కాలికంగా మాత్రమే కలిసి ఉండే వ్యక్తి అని నిర్ణయించుకుంటున్నారు.
అయితే కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒక్క చిన్న మాట ద్వారా వ్యక్తి క్యారెక్టర్ ను అంచనా వేయలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇది ఛాలెంజ్ కోసమేనని, మగవారు కొన్ని పరిస్థితుల్లో వివిధ సంఘర్షణలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తారని అంటున్నారు. అంత మాత్రన ఎదుటి వ్యక్తి నిబద్ధతను అంచనా వేయలేమని అంటున్నారు. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం ఇలాంటి వాటిని పట్టించుకొని భ్రమలో పడొద్దని సూచిస్తున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Husband test girls husband test to support them for the rest of their lives
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com