Husband and wife : ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు. అయితే భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అవసరాలకు మాత్రం డబ్బు ఉండాలి. అయితే ఈ డబ్బును లైట్ తీసుకొని చులకనగా చూడొద్దు. ఇది ఏ బంధాన్ని అయినా నిలబెడుతుంది. పడగొడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చి విడిపోయిన వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి గొడవలు రావద్దంటే ముందు నుంచి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు రావు. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉండదు. హ్యాపీగా రిలేషన్‌ని ఎంజాయ్ చేయవచ్చు కూడా.
వచ్చే ఆదాయం ఎంత, అప్పులు ఎన్ని.. వచ్చిన డబ్బుతో ఏం చేయాలి అనే విషయాలు ఇద్దరూ కలిసి మాట్లాడుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలు ముందుగానే మాట్లాడుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రతి నెలా డబ్బు విషయంలో బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు ఓ క్లారిటీ ఉంటుంది. ఎన్ని ఖర్చులున్నాయి, ఎంత వచ్చింది.. ఎంత మిగిలింది అనే విషయాల మీద ఇద్దరికి అవగాహన ఉంటుంది కాబట్టి అనవసర కోరికలు వద్దు అనుకుంటారు. ఇంటి కిరాయి, కరెంట్ బిల్ దగ్గర్నుంచి కూరగాయల ఖర్చుల ప్రతి ఒక్క విషయాన్ని బడ్జెట్ లో చిట్టాలో రాసుకోవడం వల్ల పూర్తిగా ఓ క్లారిటీ వచ్చి ఇద్దరు కూడా అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య క్లారిటీ ఉంటుంది కాబట్టి అపార్థాలు ఉండవు. గొడవలు రావు.
ఎవరి అకౌంట్ లో వారు కాస్త మనీని ఉంచుకోవడం కూడా అసవరమే. నెలవారీ ఖర్చులు, ఇష్టాఇష్టాలు అంటూ ప్రతిదానికి కొంత మనీని ఉంచేసుకోండి. దీంతో నెల మొత్తం ఖర్చులు అందులోనే అడ్జెస్ట్ అవుతాయి. సంపాదించినదంతా మొత్తం ఖర్చులు, అప్పులకే కాదు కాస్త సేవింగ్స్ కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో అనుకోకుండా వచ్చే ఆపద మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇద్దరు కూడా జాయింట్ అకౌంట్ తీసి అందులో మనీ సేవ్ చేస్తూ ఉండండి. లేదంటే ఇన్వెస్ట్ చేయండి.
రిటైర్‌మెంట్ ఇప్పుడు కాదు కదా దాని గురించి ఇప్పుడు ఎందుకులే అనుకోవద్దు. కచ్చితంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం బెటర్. రిటైర్‌మెంట్ తర్వాత ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రిటైర్ తర్వాత ఏం చేయాలి? ఎక్కడ జీవించాలి? ఎలా జీవించాలి వంటి విషయాల గురించి ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఎవరి వద్ద అయినా సరే సలహా తీసుకోండి.
ఇప్పటివరకూ ఎంత ఆదా చేశారు. గోల్స్‌ని ఎంత రీచ్ అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన ఆర్థిక అవసరాలు ఎలా తీరాయి? ముందు ముందు ఎలాంటి ఆపదలు రావచ్చు? ఎలా తీర్చుకోవాలి. వస్తే ఏం చేయాలి? వంటి విషయాల మీద కాస్త చర్చికుంటే కూడా మీ లైఫ్ మీద మీకు ఉన్న క్లారిటీకి గొడవలు రావు. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఇద్దరు కూడా సంతోషంగా లీడ్ చేసుకుంటారు.