Poultry Farming Business: మనలో చాలామంది ఉద్యోగాలతో విసిగిపోయి కొత్తగా వ్యాపారం చేయాలని భావిస్తూ ఉంటారు. అలా వ్యాపారం చేయాలని భావించే వాళ్లకు పౌల్ట్రీ ఫామ్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా ఊహించని స్థాయిలో రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వ్యాపారంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సంవత్సరం పొడవునా కోడిగుడ్లకు డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే.

పౌల్ట్రీ ద్వారా ఒక్కో కోడిగుడ్డుకు కేవలం 3.50 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రస్తుతం దుకాణాలలో కోడిగుడ్డు ధర 6 రూపాయలుగా ఉంది. ఎక్కువ సంఖ్యలో కోళ్లు ఉంటే ఎక్కువ సంఖ్యలో గుడ్లు వస్తాయి. 10,000 కోళ్లను కలిగి ఉంటే ఒక్కో గుడ్డుపై రెండు రూపాయల లాభం వేసుకున్నా ఏకంగా 20,000 రూపాయల లాభం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రోజుకు 20,000 రూపాయల లాభం అంటే నెలకు లక్షల రూపాయల లాభం వస్తుంది.
ఇందుకోసం మొదట గుడ్లు పెట్టే కోడిపిల్లలను తెచ్చుకోవాలి. 35 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉన్న కోడిపిల్లలను కొనుగోలు చేస్తే మంచిది. ఒక్కో కోడిపిల్ల కేవలం 42 రూపాయలకు లభిస్తుంది. ఒక్కో కోడిపిల్ల కోసం 3 కేజీల దాన ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో కోడిపిల్లను పెంచడానికి మూడు నెలలకు 150 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరోవైపు కోళ్లకు సులభంగా వ్యాధులు సోకే అవకాశం అయితే ఉంటుంది.
కోళ్ల ఫారం నిర్మించుకోవాలంటే కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అధిక పోషకాలు ఉండే గుడ్లను ఏ సీజన్ లో అయినా తినవచ్చు.