AC Room Humidity Tips: ప్రస్తుత వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్ (AC)లేకపోతే కష్టం అన్నట్లు తెలుస్తోంది. అయితే AC ఆన్ చేసినప్పుడు గదిలో గాలి పొడిగా మారడం ఒక సాధారణ సమస్య. గదిలోని తేమను AC తగ్గించడం వల్ల చర్మం ఎండిపోవడం, పగుళ్లు రావడం, పెదవులు పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే కళ్లు మంటలు రావడం, గొంతు ఎండిపోవడం కూడా చాలామందికి అనుభవమవుతుంది. ఇది ఎక్కువసేపు AC గదిలో ఉండేవారికి మరింత ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంట చూద్దాం..
ఏసీ ఏక్కువగా బెడ్ రూముల్ల ఉంటుంది. ఈ గదిలో ఎలాంటి వాటర్ అందుబాటులో ఉండదు. అయితే ఈ గదిలో ఒక బకెట్ నీళ్లు ఉంచితే గాలిలో కొంత తేమ నిల్వ ఉంటుంది. నీటి ఆవిరి వల్ల గది పూర్తిగా డ్రై కాకుండా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో కూడా సౌకర్యం ఉంటుంది.
అలాగే ACతో పాటు ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో ఆన్ చేయడం కూడా చాలా ఉపయోగకరం. చాలా మంది ఫ్యాన్ వేసుకుంటే చల్లదనం తగ్గుతుందని అనుకుంటారు. కానీ నిజానికి ఫ్యాన్ గదిలో చల్లటి గాలిని సమానంగా పంచుతుంది. దీంతో గదిలో ఎక్కడ ఉన్నా ఒకేలా కూలింగ్ అనిపిస్తుంది. ఇది AC పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.
టెంపరేచర్ సెట్టింగ్స్ చేసుకోవడం కూడా ఏసీ వాడేవారికి చాలా అవసరం. చాలా మంది ACని 18 సెల్సియస్ డిగ్రీలు లేదా 20 డిగ్రీల వద్ద ఉంచుతారు. కానీ నిపుణుల ప్రకారం 24 సెల్సియస్ డిగ్రల వద్ద ఉంచడం ఉత్తమం. ఈ టెంపరేచర్ వద్ద గది చల్లగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఇది మంచిది, ఎందుకంటే చాలా చల్లటి గాలి వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.
AC వాడేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. గదిలో తేమను నిలుపుకోవడం, గాలి సరైన రీతిలో ప్రసరించేలా చూసుకోవడం, సరైన టెంపరేచర్‌ను ఎంచుకోవడం చాలా అవసరం .