Sukanya Samriddhi Yojana: బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం బాలికా సమృద్ధి యోజన. ఇది పది సంవత్సరాల లోపు వయసున్న బాలికలు నెలకు రూ. వెయ్యి చొప్పున వేస్తూ ఆమెకు 21 ఏళ్లు వచ్చే సరికి ఆమెను ఆదుకునేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఆడపిల్ల పెంపకం, బాధ్యతల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వారికి వరంగా మారనుంది. ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావించే నేటి రోజుల్లో ఆమె కోసం ఇలా ప్రభుత్వం ముందుకు రావడం నిజంగా ఆహ్వానించదగినదే.

పదేళ్ల నుంచి ఇరవై ఒక సంవత్సరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా కడితే రూ. 71 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో వారి ఆలనాపాలనకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నిర్ణీత కాలంలో డబ్బు కట్టకుండా ఆగకూడదు. నెలకు వెయ్యి రూపాయలతో ఇంత భారీ మొత్తం లభించడం నిజంగా ఆడపిల్లలకు వరంగానే భావించాలి. దీనిపై ఆడపిల్లల తల్లిదండ్రులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఏర్పడింది.
2015 జనవరిలో ఈ పథకం ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ఈ పాలసీని తీసుకొచ్చింది. అమ్మాయి పెళ్లి, చదువుల ఖర్చులకు కావాల్సిన డబ్బు అందిస్తోంది. ఆదాయపు పన్ను కూడా ఉండదు. ఆడపిల్లల పాలిట ఎంతో ఉపయుక్తంగా ఉన్న దీన్ని ప్రతి బాలిక కోసం ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. వారికి పెళ్లీడు వచ్చే నాటికి వారి అవసరాల కోసం డబ్బు మనకు చేతికందడం నిజంగా బాగుంది. దీంతో తల్లిదండ్రులు గమనించి బాలిక సమృద్ధి యోజనలో తక్షణమే చేరేలా ప్రోత్సహించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇందులో చేరవచ్చు. పిల్లలకు గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత విద్యావకాశాలు వచ్చేసరికి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటుంది. పేద వారికి అండగా నిలుస్తుంది. అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అందుకే అందరు విధిగా ఈ పథకంలో చేరి డబ్బు వేసుకోవచ్చు. నెలకు వెయ్యి రూపాయలు కడితే చాలు అమ్మాయికి భరోసా ఉంటుంది. వారి జీవితానికి ఒక గమ్యం దొరుకుతుంది. వారి చదువుకు తోడ్పాటు లభిస్తుంది.