Ghost Mall : కోవిడ్-19 మహమ్మారితో దేశంలోని మాల్స్ అన్నీ మూతపడ్డాయి. జనసందోహంతో కళకళలాడే వీటికి జనాలు రావడమే మానేశారు. ఇక కరోనా తగ్గుముఖం పట్టడంతో భారతదేశంలోని మాల్స్ వేగంగా పుంజుకోవడం ప్రారంభించాయి. అయినప్పటికీ కొన్ని మాల్స్ దుకాణాలు ఇప్పటికీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అందులో జనసంచారం కనిపించడం లేదు. అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలోని వ్యవస్థీకృత రిటైల్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఘోస్ట్ మాల్‌లు పుట్టుకొచ్చాయి.

నైట్ ఫ్రాంక్ “థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2022 – రీఇన్వెంటింగ్ ఇండియన్ షాపింగ్ మాల్స్” నివేదిక ప్రకారం.. భారతదేశంలోని టాప్-8 నగరాల్లో 21% లేదా 57 మాల్స్ ప్రస్తుతం వివిధ దశల్లో శిథిలావస్థలో ఉన్నాయి. ఈ 57 ఘోస్ట్ మాల్స్ దాదాపు 8.4 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు స్థలంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. 40% కంటే ఎక్కువ ఖాళీగా ఉన్న మాల్ లను “ఘోస్ట్ మాల్”గా పిలుస్తారు.
ఈ మాల్స్‌లో కొన్నింటిలో మొత్తం మాల్‌తో కూడిన పెద్ద ఫార్మాట్ స్టోర్‌లను మూసివేయడానికి రద్దు నోటీసులు అందించారు. కార్యకలాపాలను నిలిపివేయడం, మాల్ ఆవరణలోని దుకాణాలను కూల్చివేయడం..చెల్లింపు చేయని కారణంగా మాల్ ఆస్తులను వేలం వేయడం చేస్తున్నారు. స్థానిక మాల్ అథారిటీకి బకాయిలు కూడా పేరుకుపోయాయి.
నివేదిక ప్రకారం.. ఢిల్లీ రాజధాని ప్రాంతం (NCR)లో ఎక్కువగా మాల్స్ ఖాళీగా ఉన్నాయి. 3.35 మిలియన్ చదరపు అడుగుల అతిపెద్ద మాల్స్ ఖాళీగా పడిఉన్నాయి. ‘దెయ్యాల మాల్స్’తో ఆక్రమించాయి. ఐటీ నగరమైన బెంగళూరులో 1.38 మిలియన్ చ.అ. స్థలం ‘ఘోస్ట్ మాల్స్’ ఆక్రమించబడింది. హైదరాబాద్ మరియు ముంబై వరుసగా 1.14 మిలియన్ చదరపు అడుగులు, 1.13 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో ఘోస్ట్ మాల్స్ ఉన్నాయి. ఘోస్ట్ మాల్స్ ఉన్న ఇతర భారతీయ నగరాలు చూస్తే.. అహ్మదాబాద్ (0.37 మిలియన్ చదరపు అడుగులు); పూణే (0.37 మిలియన్ చదరపు అడుగులు); కోల్‌కతా (0.32 మిలియన్ చదరపు అడుగులు), చెన్నై (0.33 మిలియన్ చదరపు అడుగులు) లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
-భారతదేశంలో ఇన్ని ఘోస్ట్ మాల్స్ ఎందుకు ఉన్నాయి?
నివేదిక ప్రకారం, దేశంలోని ఘోస్ట్ మాల్స్ స్టాక్‌ల వెనుక అనేక అంశాలు ఉన్నాయి. తగిన శ్రద్ధ లేకపోవడం, పరిమాణం మరియు యాజమాన్యాలు సరిగాలేకపోవడం.. మాల్ లోపాలు, డిజైన్ సమస్యలు, చీకటి సందులతో తప్పు లేఅవుట్, కస్టమర్ వాక్ ఫ్లో మేనేజ్‌మెంట్ లేకపోవడం, తక్కువ ఆక్యుపెన్సీ మరియు అద్దెదారులు లేకపోవడం.. ఇలా మాల్స్ కు ఆదరణ కోల్పోవడానికి కారణంగా చెబుతారు. వీటన్నింటిని ఘోస్ట్ మాల్స్ గా అభివర్ణిస్తారు.