Transformer: మన నిత్యజీవితంతో కొన్ని పెనవేసుకుంటాయి. అందులో విద్యుత్ ఒకటి. తెల్లవారింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు కూడా కరెంటు అవసరమే. లేకపోతే మనిషి మనుగడ సాగదనే విషయం తెలిసిందే. ప్రతిది కూడా కరెంటుతోనే ముడిపడి ఉంది. కనీసం సెల్ ఫోన్ చార్జింగ్ కు కూడా కరెంటు కావాలి. అలాంటి కరెంటును మనం వాడుతున్నా అది మనకు ఎలా చేరుతుందో తెలుస్తుందా? దానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో అర్థమవుతుందా? దానికి ఓ యంత్రాంగమే కావాలి. లేకపోతే కరెంటు మన ఇంట్లోకి రాదనే విషయం తెలుసుకోవాలి.

బొగ్గు, నీళ్ల ద్వారా కరెంటును ఉత్పత్తి చేస్తారు. రాబోయే తరాలకు బొగ్గు నిల్వలు అయిపోతాయనే భయం పట్టుకుంది. భవిష్యత్ తరాలకు విద్యుత్ అవసరం ఉంటుందనే విషయం తెలుస్తోంది. కానీ విద్యుత్ మన ఇంటికి సరఫరా అయ్యే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరెంటు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. కరెంటు ఉత్పత్తి చేయడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సిందే.
Also Read: DS vs KCR: హమ్మయ్యా.. కేసీఆర్ నే ముప్పుతిప్పలు పెట్టి చివరకే ఇలా వైదొలిగాడు!
కరెంటును సరఫరా చేయడంలో నియంత్రణ చేసేది ట్రాన్స్ ఫార్మరే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అటు సబ్ స్టేషన్ నుంచి ఇటు వచ్చే కరెంటును నియంత్రించి మళ్లీ దాన్ని ఇళ్లకు పంపడానికి ట్రాన్స్ ఫార్మర్ ప్రధాన భూమిక పోషిస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్ ఫార్మర్ కరెంటును అదుపులో ఉంచుతుంది. దీంతో విద్యుత్ వినియోగం అంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది.

విద్యుత్ ను ఉత్పత్తి చేసేందకు కూడా ఖర్చు బాగానే ఉంటోంది. కానీ ప్రభుత్వాలు విద్యుత్ ను తయారు చేసి దాన్ని ప్రజలకు అందించడంతో పనలుు సాఫీగా సాగుతున్నాయనే విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ను ఆదా చేస్తే ఉత్పత్తి చేరసినట్లే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పూర్వ కాలంలో కరెంటు లేకపోవడంతో ఏ పని కూడా ముందుకు సాగలేదనే విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విద్యుత్ ను వినియోగించే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
Also Read:RRR: 48 రోజుల కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్లో తెలిస్తే షాకే