Site icon OkTelugu

Tamannaah Bhatia: వయసు పెరిగినా.. వేడి వేడి అందాలు వడ్డిస్తున్న తమన్నా

Tamannaah Bhatia: తెలుగు తెరపై పాల నురుగు అందాలను అద్దిన భామ ‘మిల్కీ బ్యూటీ తమన్నా’. రెండు దశాబ్దాలుగా కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ముద్రించింది ఈ ముదురు భామ. పైగా వయసు అయిపోతున్నా ఎక్స్ పోజింగ్ లో అసలు తగ్గేదే లే అంటుంది. తాజాగా ‘ఎఫ్ 3’ సినిమా నుంచి వచ్చిన ‘తమన్నా’ బోల్డ్ ఫోటో ఒకటి, ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది.

Tamannaah Bhatia

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ లేటెస్ట్ పోస్టర్ ను వదిలారు. పోస్టర్‌ లో తమన్నా ఎరుపు రంగు దుస్తుల్లో చాలా గ్లామర్‌గా కనిపించింది. పైగా తన ఒయ్యారాలు హైలైట్ అయ్యేలా ఒళ్ళు విరుచుకుని నిలబడింది. మొత్తానికి అందాల ఆరబోత కోసం తమన్నా చాలా కష్టపడింది.

Also Read: Shiaji Shinde Kota: యముడిగా షియాజీషిండే సూట్ అవుతాడా? షాకింగ్ కామెంట్స్ చేసిన కోటా శ్రీనివాసరావు

ఆ కష్టం పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి, మీరు కూడా తమన్నా ఫోటో పై ఒక లుక్కేయండి. ఏది ఏమైనా ఈ బోల్డ్ ఫోటో.. సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఎలాగూ, దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీ పెట్టాడట.

Tamannaah Bhatia

ఈ సినిమాలో అనిల్ పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడట. అదే విధంగా ఎఫ్ 2లోని వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల కోబ్రా బంధం, ఎఫ్ 3లో కూడా కంటిన్యూ అవ్వనుంది. ఇక ఈ సీక్వెల్ లోనూ త‌మ‌న్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. త‌మ‌న్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించింది.

Also Read:Meenakshi Chaudhary: ఫోజులతో మతిపోగొడుతుంది,   కిర్రాక్ అందంతో మంట పెడుతుంది !        

Exit mobile version