Accept The Mistakes Of Others: సమాజంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచి దారిలో వెళ్లడం వల్ల అంతా మంచే జరుగుతుందని కొందరు భావిస్తారు.. మరికొందరు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన లేదా.. స్వార్థపూరిత గుణం ఉన్న వారు తప్పుడుమార్గంలో వెళ్తారు. కొందరు చేసే తప్పుడు పనులకు ఇది తప్పు అని చెప్పడం వల్ల వారు రిసీవ్ చేసుకోరు. దీంతో కొందరు దయాగుణులు వారిని క్షమిస్తారు. కానీ వారు మరో తప్పు చేయడానికి రెడీ అవుతారు. మొదటి తప్పు వద్దే వారితో కఠినంగా ఉండడం వల్ల రెండో తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. మరి మొదటి తప్పు వద్ద వారితో ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి?
ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి తనకు అనుగుణంగా ఉండే మార్గాల్లో వెల్తాడు.ఈ సమయంలో మంచీ జరగొచ్చు.. చెడు జరగొచ్చు.. మంచి చెడులను స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలి. కానీ మనం ఎంత మంచిగా ఉన్నా కొందరు కావాలనే తప్పులు చేస్తుంటారు. వారి వల్ల ఇబ్బందులు గురికావొచ్చు. అయినా కొందరు భరిస్తారు. ఎందుకంటే వారితో ఉన్న బంధుత్వం లేదా అవసరం ఉంటుంది. బంధుత్వ విషయంలో తమ వారే అని వారు ఎన్ని తప్పులు చేసినా చూసీ చూడనట్లు వెళ్తారు. ఎంత దగ్గరి బంధువైనా వారు చేసే తప్పును కఠినంగా సమాధానం చెప్పాల్సిందే. వారు పరుష పదాలు వాడితే అదే విధంగా పదాలు వాడాల్సిందే. అప్పుడే వారికి బుద్ధి చెప్పినట్లు అవుతుంది.
ఇంకొందరు అవసరం కోసం ఎదుటివారి తప్పులను మన్నిస్తూ ఉంటారు. కాన వీరు తమ తప్పును తెలుసుకుంటే పర్వాలేదు. కానీ మితిమీరిన తప్పులు చేయడం వల్ల సమాజానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారిని క్షమించాల్సిన అవసరం లేదు. మితిమీరిన తప్పులు చేసేవాళ్లు వారి బాటలోనే వెళ్తూ.. కఠినంగానే ప్రవర్తించాలి. అప్పుడే వారు తమ తప్పును గురించి తెలుసుకుంటారు. మరోసారి తప్పు చేయకుండా ఉంటారు.
కొందరు ఎదుటివారిపై ఎప్పుడూ అరుస్తుంటారు. ఎదుటి వాళ్లు చిన్నగా మాట్లాడినా వీరు పెద్ద నోరు వేసుకొని అరుస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అంతేస్థాయిలోనే అరుస్తూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎదుటివారు చిన్నగా మాట్లాడడం వల్ల వారు అదునుగా తీసుకొని పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. వీరికి అవకాశం ఇస్తే ఎప్పుడూ అదే ఇబ్బందులకు గురి చేస్తారు. అందువల్ల వారికి తగిన విధంగా బుద్ధి చెప్పేలా వారిబాటలోనే వెళ్లాలి.
తప్పులు అందరూ చేస్తారు. తెలియక చేసిన తప్పులతో కొందరు రియలైజ్ అవుతూ ఉంటారు. కానీ కొందరు కావాలనే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు దండోపానం ఉపయోగించినా పర్వాలేదు. ఎందుకంటే అధర్మ మార్గంలో వెళ్లే వారిని ధర్మం వైపు నడవాలని సూచిస్తారు. ఇది ధర్మం కోసమే అని గుర్తించాలి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో కొన్ని సార్లు కఠినంగా ఉన్నా పర్వలేదు. వారు తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ముందుగా సర్ది చెప్పాలి. అయినా వినకపోతే కఠినంగా ఉండాలి. లేకుంటే వారు భవిష్యత్ లో తప్పుడు వ్యక్తిగా మారే ప్రమాదం ఉంది.