Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు…ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను కూడా సంపాదించి పెట్టాయి. మరి ఇప్పుడు ఖాళీగా ఉంటున్న ఆయన మరోసారి సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మోహన్ బాబు రాణిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన చేసిన సినిమాలేవి ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతున్నప్పటికి ఢీ సినిమాని మినహాయిస్తే మరో సక్సెస్ ఫుల్ సినిమా అయితే లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి ఒక మంచి సినిమా రావాలని ఉద్దేశ్యంతో 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తీస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఆయన ఎలాంటి స్టార్ డంమ్ ను సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాత్రలో ప్రభాస్ నటించడం వల్ల ప్రభాస్ కెరియర్ కి ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నిజానికైతే ప్రభాస్ అభిమానులు ఆయన ఎందుకు ఈ పాత్రని చేస్తున్నాడు అంటూ కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాకి ప్లస్ అవుతున్నప్పటికి ప్రభాస్ కి మాత్రం మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అనే ధోరణిలో కూడా ట్రెడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
మరి సినిమా విడుదలైతే గాని ప్రభాస్ ఎలాంటి పాత్రలు చేశాడు. ఆయన పాత్రకి ఎంత స్క్రీన్ స్పేస్ ఉంది. తద్వారా ప్రభాస్ కెరియర్ కి ఇదేమైనా యూజ్ అవుతుందా లేదంటే కన్నప్ప సినిమాకు అయిన ఈ పాత్ర ఎంతవరకు ప్లస్ అవుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు.
కానీ కన్నప్ప సినిమాకి కూడా అలాంటి ఎదురుచూపులు ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ప్రభాస్ అభిమానులను క్యాష్ చేసుకోవడానికి మంచు విష్ణు తనను ఈ సినిమాలో తీసుకున్నాను అని చెప్పడం విశేషం… మరి కన్నప్ప సినిమా మంచు విష్ణును సేవ్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..