Happy Life: నేటి కాలంలో డబ్బు లేకపోతే జీవితమే లేదు. పుట్టే బిడ్డ నుంచి చివరి మజిలీ లో ఉండే వృద్దుల వరకు డబ్బుతోనే సౌకర్యాలు సమకూరుతున్నాయి. అయితే రోజురోజుకు ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం కొంతమందికి వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఖర్చులకు అనుగుణంగా డబ్బు సంపాదించాలని చాలామంది తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే కొందరు మాత్రం కావలసిన డబ్బు ఉన్నా.. అత్యధికంగా డబ్బు సంపాదించాలంటే ఆరాటపడుతున్నారు. అయితే డబ్బు ఉన్నవారు.. లేనివారు.. ఇద్దరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి డబ్బు ఎంత ఉండాలి? ఎంత సంపాదించడం వల్ల జీవితం తృప్తిగా ఉంటుంది?
ఉదయం నుంచి సాయంత్రం వరకు.. తినే ఆహారం నుంచి ప్రయాణించే వాహనం వరకు.. ప్రతి ఒక్కటి డబ్బుతోనే సాగుతుంది. అయితే ఒక మనిషికి ఎంత డబ్బు కావాలన్నది.. ప్రామాణికం లేదు. ఎందుకంటే డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే అంత సుఖంగా ఉంటుందని కొందరి భావన. డబ్బు ఎంత ఎక్కువగా సంపాదిస్తే తమతో పాటు తమ తర్వాత తరాలు కూడా సుఖంగా ఉంటారని అనుకుంటారు. దీంతో కొందరు శక్తికి మించి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. అయితే ఎంత కష్టపడినా ఒక్కోసారి అదృష్టం లేకపోతే డబ్బు సంపాదించలేవని ఇంకొందరు అంటారు. ఏది ఏమైనా డబ్బు లేకపోతే మాత్రం జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే అన్ని కష్టాలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని కాపాడుకోవడానికి నిత్యం శ్రమించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఫలితంగా అనేక టెన్షన్లు.. ఒత్తిడితో ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
అయితే జీవితంలో సంతోషంగా ఉండాలంటే సరిపోయేంత డబ్బు ఎప్పటికీ ఉండదు. అలాంటప్పుడు అవసరాలకు డబ్బు సంపాదించుకొని.. ఆనందకరమైన జీవితం కోసం ప్రయత్నించాలి. అంటే ఒకవైపు డబ్బు సంపాదిస్తూనే మరోవైపు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూ.. స్నేహితులను కలుస్తూ.. ఇతర కార్యక్రమాలు చేయడం వల్ల కూడా సంతోషంగా ఉండగలుగుతారు. కేవలం డబ్బు ఉంటేనే సంతోషం అంటే పొరపాటు. అలా కాకుండా డబ్బు లేకపోతే కూడా సంతోషం ఉండదు. అలా అయితే కావలసినంత డబ్బు సంపాదించుకొని.. ఆనందకరమైన జీవితం కూడా అనుభవించాలని అంటున్నారు. ఎప్పుడైతే కేవలం డబ్బు అని చూడకుండా మంచి జీవితం కావాలని కోరుకుంటారో వారు జీవితంలో అమితమైన తృప్తిని పొందగలుగుతారని చెబుతున్నారు. అందుకోసం డబ్బు కోసం మాత్రమే కాకుండా సమాజంలో మంచి చెడుల గురించి కూడా ఆలోచించాలని.. అలాగే ఇతర మానవ సంబంధిత కార్యక్రమాలను కూడా చేపట్టాలని పేర్కొంటున్నారు.