Money and Gold : కొందరి ఇంట్లో కుప్పల కొద్ది నగదు బయటపడుతూ ఉంటుంది.. మరికొందరి ఇంట్లో స్థాయికి మించిన బంగారం కనిపిస్తూ ఉంటుంది.. ఇలా అవసరానికి మించిన ఆదాయం లేదా బంగారం ఉన్న వారి ఇంట్లో ఈడి సోదాలు చేసి వారి నుంచి నగదు లేదా బంగారం జప్తు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలామందికి సందేహం ఉంటుంది. అసలు ఇంట్లో బంగారం ఎంత నిల్వ చేసుకోవాలి? డబ్బు ఎంత నిల్వ ఉంచుకోవాలి? ఎక్కువగా నిల్వ ఉంటే ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్ళండి..
సాధారణంగా అయితే ఇంట్లో నగదు ఎంతైనా ఉంచుకోవచ్చు. అయితే ఎంత నగదు ఉంచుకున్న దానికి సంబంధించిన ఆధారాలు కచ్చితంగా ఉండాలి. అంటే ఈ డబ్బు అక్రమమైనది కాకుండా.. లేదా ప్రభుత్వ సొమ్ము కాకుండా కాకుండా ఉండాలి. ఇలా ఆధారాలు లేకుండా కుప్పలుగా డబ్బు ఉన్నట్లయితే దానిని అధికారులు కచ్చితంగా స్వాధీనం చేసుకుంటారు. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్లు 68, 69 బి ప్రకారం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా సరే తమ ఇంట్లో రికార్డుల్లో లేని ఆదాయం ఉన్నా.. ఆదాయం ఎక్కువ వచ్చి ఉండి ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఉన్నా.. అలాంటి వారి నుంచి ఆదాయపు పన్ను శాఖ నగదును జప్తు చేసుకుంటుంది. ఒకవేళ స్థాయికి మించిన ఆదాయం ఉండి దానికి సంబంధించిన వివరాలు తెలపకపోతే 78% పన్ను విధించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఒకేరోజు రూ. రెండు లక్షల కంటే ఎక్కువగా నగదు లావాదేవీలు చేసినప్పుడు.. అది దేనికోసం చేస్తున్నాము వివరించాలి. ఆ వ్యక్తి ఇచ్చే వివరణ ఆదాయపు పన్ను శాఖ సమ్మతమైతే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నిబంధనలు ఉల్లాకి ఇస్తే మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : ఇంట్లోనే ఇలా గోల్డెన్ ఫేషియల్ వేసుకోండి.
బంగారం విషయంలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వివాహిత మహిళలు ఇంట్లో 500 గ్రాముల వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు. పెళ్ళికాని వారు మాత్రం 250 గ్రాములు ధరించవచ్చు. పురుషులు అయితే 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే నిల్వ ఉంచుకోవడానికి అనుమతి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిబంధనల ప్రకారం శరీరంపై కాకుండా ఇంట్లోనూ బంగారాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఈ బంగారం సంబంధించిన రసీదులు ఉంచుకోవాలి. లేదా ఎవరి కోసం అయితే బంగారాన్ని నిలువ ఉంచుకున్నామో ఆ విషయాలను తెలియజెప్పాలి. కొందరు వివాహం కోసం బంగారం కొనుగోలు చేస్తారు. అందుకు సంబంధించిన రసీదులు తప్పనిసరిగా ఉంచాలి.
ఒక వ్యక్తి ఇంట్లో నగదు లేదా బంగారం ఎంతైనా నిల్వ ఉంచుకోవచ్చు. అలా ఉంచుకోవడం ఎంత మాత్రం అక్రమం కాదు. కానీ వాటికి ఆధారాలు లేనప్పుడే అది అక్రమంగా మారుతుంది. ఎంత మొత్తంలో అయితే అక్రమంగా ఉంటుందో దానితోపాటు అదనంగా జరిమానా విధిస్తూ ఆదాయపు పన్ను శాఖ నగదు లేదా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వంలో పని చేసేవారు తమ ఆదాయ వివరాలు తప్పనిసరిగా అకౌంట్ చూపించాలి. లేకుంటే వారిపై జరిమానాలు మాత్రమే కాకుండా కేసులు కూడా నమోదయ్య అవకాశం ఉంటుంది.