https://oktelugu.com/

Sitting On floor : నేలపై కూర్చోని తింటే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే?

డైనింగ్ టేబుల్ మీద కంటే నేల మీద కూర్చోని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా తినడంతో పాటు కండరాల నొప్పి వంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. అలాగే కండరాల్లో కదలిక పెరగడంతో ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది నేల మీద కూర్చుని ప్లేటు ఒడిలో పెట్టుకుని తింటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 2, 2024 / 03:32 AM IST

    Sitting On floor

    Follow us on

    Sitting On floor : పూర్వం రోజుల్లో భోజనం అంటే అరటి ఆకులో వేసుకుని నేల మీద తినేవారు. కానీ ఈరోజుల్లో డైనింగ్ టేబుల్స్, కుర్చీల్లో భోజనం చేస్తున్నారు. మోకాళ్ల నొప్పి, నడుం నొప్పి అని అసలు కింద కూడా కూర్చోవడం లేదు. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి బరువు పెరుగుతున్నారు. నేలపై కూర్చోని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈరోజుల్లో నేలపై కూర్చోని తినే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చోని తినడం ఇప్పుడు ఫ్యాషన్ కావచ్చు. కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎంత ఫ్యాషన్ ఫాలో అయినా సరే.. నేలపై కూర్చోని తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

    డైనింగ్ టేబుల్ మీద కంటే నేల మీద కూర్చోని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా తినడంతో పాటు కండరాల నొప్పి వంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. అలాగే కండరాల్లో కదలిక పెరగడంతో ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది నేల మీద కూర్చుని ప్లేటు ఒడిలో పెట్టుకుని తింటారు. ఇలా తినడం అంత మంచిది కాదు. ప్లేటు నేల మీద పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ముందు వంగి తినడం వల్ల తినే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. కాళ్లు ముడుచుకుని నేల మీద కూర్చోని తింటే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా కూర్చుని తింటే ఈజీగా బరువు తగ్గవచ్చు. డైనింగ్ టేబుల్‌పై కూర్చొంటే ఎంత తింటున్నారో కూడా తెలియదు. దీనివల్ల బరువు పెరుగుతారు. నేల మీద కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని తినడం వల్ల సంబంధాలు పెరుగుతాయి.

    నేలపై కూర్చోని తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. బీపీ కంట్రోల్ కావడంతో పాటు గుండెకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. కూర్చీ లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటే గుండెకు సరిగ్గా రక్తప్రసరణ జరగదు. అలాగే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. కింద కూర్చుని తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నేల మీద కూర్చుని తినడం వల్ల ఎక్కువకాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. పద్మాసనంలో కూర్చుని తింటే ఎముకలు బలంగా మారుతాయి. అలాగే బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. కొంతమంది ఎలాంటి టెన్షన్ లేకపోయిన కూడా ప్రశాంతంగా ఉండరు. అదే నేల మీద కూర్చుని తినడం వల్ల మనస్సుకు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి డైనింగ్ టేబుల్లు, కుర్చీలు, సోఫాలు మీద కూర్చుని భోజనం చేయవద్దు. ఇలా చేసి అనారోగ్య సమస్యలను పెంచుకోవద్దు. కాబట్టి వీలైనంత వరకు నేల మీద కూర్చుని మాత్రమే భోజనం చేయండి.