https://oktelugu.com/

Eating Chocolates: డైలీ చాక్లెట్లు తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!

చాక్లెట్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే పొద్దున్న లేచినప్పటి నుంచే ఇవి కావాలని మారాం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇచ్చేస్తుంటారు. అయితే పిల్లలకు వీటిని ఎక్కువగా ఇవ్వకూడదు. అధికంగా వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 2, 2024 / 12:23 AM IST

    Eating Chocolates

    Follow us on

    Eating Chocolates: చాక్లెట్లు అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే ఫుడ్ లేకపోయిన ఉంటారు. కానీ ఈ చాక్లెట్స్ లేకుండా అసలు ఉండలేరు. అయితే వీటిని అధికంగా తినకూడదు. తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. చాక్లెట్స్ తినడానికి స్వీట్‌గా, టేస్టీగా ఉంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. ఏ పదార్థాన్ని అయిన కాస్త లిమిట్‌లో మాత్రమే తినాలి. అతిగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే అందరూ ఎంతగానో ఇష్టపడే చాక్లెట్లను రోజూ అధికంగా తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? రోజుకి ఎన్ని చాక్లెట్లు తినాలో తెలుసుకుందాం.

    చాక్లెట్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే పొద్దున్న లేచినప్పటి నుంచే ఇవి కావాలని మారాం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇచ్చేస్తుంటారు. అయితే పిల్లలకు వీటిని ఎక్కువగా ఇవ్వకూడదు. అధికంగా వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అతిగా చాక్లెట్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. వీటితో పాటు మలబద్దకం, కడుపు ఉబ్బరం, తిమ్మిరి, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఎందుకంటే చాక్లెట్లలో కొవ్వు, కెఫిన్, చక్కెర అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణం కాదు. అలాగే ఇవి పేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రావడం, పొట్టలో పురుగులు కావడం వంటివి అవుతాయి. చాక్లెట్లు తింటే యాక్టివ్‌గా ఉంటారు. కానీ మేలు కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.

    ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్‌లోడ్ అవుతుంది. దీంతో కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎక్కువగా తినడం వల్ల చిరాకుగా ఉండటం వంటివి జరుగుతాయి. వీటివల్ల బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్ని చాక్లెట్లలో పురుగులు ఉంటాయి. వీటిని వల్ల అనారోగ్య బారిన పడతారు. అలాగే దద్దుర్లు, వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. చాక్లెట్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు అయితే మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. వీటి తయారీకి పాలు, కోకో బటర్ వంటివి వాడుతారు. వీటివల్ల ముఖంపై అధికంగా మొటిమలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. పిల్లలకు అయితే అస్సలు చాక్లెట్లు ఇవ్వకండి. మరీ ఏడిస్తే ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టండి.