https://oktelugu.com/

Alone : ఒంటరిగా ఉంటే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?

ఒంటరిగా ఉండేవాళ్లు ఎదుట వ్యక్తులపై ఆధారపడరు. ఎంత కష్టం వచ్చిన ఇతరుల సాయం తీసుకోరు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని అనుకుంటారు. వాళ్లకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. లైఫ్‌లో ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని అలవర్చుకుంటారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 2, 2024 / 04:28 AM IST

    Alone

    Follow us on

    Alone : ప్రస్తుత జీవనశైలి, వ్యక్తిగత కారణాల వల్ల చాలామంది ఒంటరిగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఉండటానికి అంతగా ఇష్టపడరు. అయితే ఒంటరిగా ఉండటం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్తారని, మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారని చాలామంది అంటుంటారు. కానీ ఒంటరిగా ఉండటం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఒంటరిగా ఉండటం అంత ఈజీ కాదు. ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం అనేది చాలా కష్టం. ఇతరులతో కలిసి ఉంటే ఎదుటివారితో కలిసి ఉండలేమని ఉద్దేశంతో కొందరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒంటరితనం అనేది భయంకరంగా ఉంటుంది. కానీ యువత ఒంటరిగా ఉండాలనే ఫిక్స్ అవుతున్నారు. అయితే ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

    అందరితో కలిసి ఉంటే మన ఇష్టాలకు విలువ ఉండదు. మీకు నచ్చినట్లు కాకుండా.. ఇతరులకు నచ్చినట్లు బతకాలి. అదే ఒంటరిగా ఉంటే మీకు నచ్చినవి చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు. నచ్చిన ఫుడ్ తినవచ్చు. అదే అందరితో కలిసి ఉంటే వాళ్లకు నచ్చిన ఫుడ్ మాత్రమే తినాలి. ఒంటరిగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. చాలామంది కెరీర్ విషయంలో వాళ్లకు నచ్చిన చదువు, ఉద్యోగం వంటివి వేరే వాళ్లకు ఇష్టమైనవి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో కొన్ని గోల్స్ ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలంటే ఒంటరిగా ఉంటే సాయపడుతుంది. ఒంటరిగా ఉండటం వల్ల లైఫ్‌లో చాలా విషయాలు నేర్చుకుంటారు. ఆర్థికంగా, మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. బంధాలు ఉన్న లేకపోయిన ఒకేలా ఉంటారు. ఎమోషన్స్‌కి అంతగా ఎటాచ్ కారు. బంధాలు ఉన్నా, లేకపోయిన వాళ్లు మాత్రం ఒకేలా ఉంటారు.

    ఒంటరిగా ఉండేవాళ్లు ఎదుట వ్యక్తులపై ఆధారపడరు. ఎంత కష్టం వచ్చిన ఇతరుల సాయం తీసుకోరు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని అనుకుంటారు. వాళ్లకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. లైఫ్‌లో ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని అలవర్చుకుంటారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనే విషయాలపై కూడా వాళ్లకు ఒక క్లారిటీ ఉంటుంది. నిజానికి వీళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. కానీ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల అందరికీ దూరంగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సాధారణంగా ఒంటరితనం మానసిక సమస్యలకు దారితీస్తుందని అందరూ అంటారు. కానీ ఒంటరితనం మానసికంగా మనం ఎంతో స్ట్రాంగ్‌ తెలిసేలా చేస్తుంది. ఎలాంటి సమస్యలను అయిన ఎదుర్కొగలం అనే గుణపాఠాన్ని నేర్పుతుంది. ఒంటరిగా ఉంటే మీకు ఎక్కువ సమయం ఉంటుంది. ఇలాంటప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. యోగా, మెడిటేషన్ వంటివి చేయవచ్చు. లైఫ్‌లో దేని వల్ల నేర్చుకోనిది ఒంటరితనం వల్ల నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒంటరితనం ఒక బెస్ట్ టీచర్ అని చెప్పుకోవచ్చు.