Motivation: బాల్యం చాలా గొప్పది కదా. బాల్యంలో ఉన్నంత సంతోషం ఎప్పుడు ఉండదు. ఏది తెలియని వయసు. మంచి, చెడు, కష్టం, నష్టం, సుఖం వంటి వాటిపై అవగాహన ఉండదు. మనసులో ఏది అనిపిస్తే అది చేయడం, మంచి చెడు చూసుకోవడానికి అమ్మానాన్న, అక్క, అన్నయ్య, తమ్ముడు ఇలా ఎవరో ఒకరు మనతో ఉంటారు. అమ్మమ్మ నానమ్మ తాతయ్యల బుజ్జగింపు ఎంత బాగుంటుంది. కదా. వారు ఏం తెచ్చినా సరే కడుపు నిండా తినే వరకు ఏడ్వాల్సిందే. అమ్మానాన్ని దగ్గర డబ్బు ఉందా లేదా అన్న విషయం కూడా మనకు అవసరం లేదు. కావాలంటే కావాలి అంతే..
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
కాలం అన్నీ నేర్పిస్తుంది?
పెద్దయ్యాక అంతా మారిపోతుంది. ఉదయం 9 గంటలకు వరకు పడుకున్న నువ్వే తెల్లవారు జామున్నే లేచి ఇంట్లో పనులు చేయాలి. లేదా 6 గంటలకే ఆఫీస్ లో లాగిన్ అవ్వాలి. అమ్మమ్మల దగ్గర గార్వం చేసిన నువ్వే నీ పిల్లలను బుజ్జగిస్తూ ఉండాలి. భార్య, పిల్లల బాధ్యత నువ్వే చూసుకోవాలి. నువ్వే ఆ రోజు చిన్నదానికి ఏడ్చింది నువ్వే. ఈ రోజు ఏడ్వవద్దు అని చెబుతుందీ నువ్వే. కాలం ఎంత గొప్పది కదా. అందరికీ అన్నీ నేర్పిస్తుంది. ఏడ్వడం, ఏడిపించడం, బుజ్జగించడం, బాధ్యతలు, బరువులు, బంధాలు, సంతోషాలు, కష్టాలు, నష్టాలు, అనుభవాలు ఇలా అన్నింటిని నేర్పిస్తుంది ఆ కాలం.
విధి ఆడించే ఈ ఆటలో నువ్వు తోలుబొమ్మవు మాత్రమే అనుకోకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ ఎన్ని కష్టాలు ఎదురువచ్చినా ఈ బతుకు అనే సముద్రాన్ని ఈదుతూ గమ్యాన్ని చేరాల్సిందే. నదిని ఈదడం సులభమే. కానీ సముద్రం? అప్పుడే కదా నువ్వంటే ఏంటో నీకు తెలిసేది. నీ మీద నీకు నమ్మకం కలిగేది. ఈదు ఎన్ని అలలు ఎదురచ్చినా ఈదు ఎంత కష్టం వచ్చినా ఓర్చుకో. ఆ సముద్రంలో పడవలు, ఓడలను నీకు స్నేహితులుగా చేసుకుంటూ నీ గమ్యాన్ని చేరడానికి కష్టపడు.
ఒకప్పుడు తల్లిదండ్రి నీ ఫ్యూచర్ కోసం చదివిస్తే ఆటలు, పాటలు, అల్లరి అంటూ బంక్ కొట్టావు కదా. అప్పుడు నీకు ఫ్యూచర్ తెలియదు కదా. కానీ నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు రెండింటిని ఇప్పుడు నువ్వే ముందుకు నడిపించాలి. నువ్వు చేసిన తప్పులను నీ పిల్లలు చేయకుండా సరిదిద్దు. ఆట పాటలతో పాటు భవిష్యత్తు ప్రణాళికను నువ్వే వేసి దారి చూపించు. కానీ వారి బాల్యాన్ని అంధకారంలోకి నెట్టేయకు. ఎందుకంటే అప్పుడు ఆ గడిచిన కాలంలో ఉంది. నువ్వే. ఇప్పుడు ఈ నడుస్తున్న కాలంలో కొనసాగుతుంది నువ్వే. సమాజం మంచిది. చెడ్డది. ఇక సాగిపో సోదరా.. ఉంటా. జాగ్రత్త మరి.