Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన కొంతవరకు గాడి తప్పినప్పటికి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం… అయితే పూరి జగన్నాథ్ చాలా ఫాస్ట్ గా సినిమాను చేసి రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకునేవాడు. ఒకప్పుడు ఆయన చేసిన ఈ పని వల్ల చాలా మంది ప్రొడ్యూసర్లు ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు…ఇప్పుడు అలాంటి దర్శకుడు ఎవరు లేరని చాలామంది వాపోతున్నారు. ఎందుకంటే స్టార్ హీరోలందరు సంవత్సరాలు సంవత్సరాలుగా సినిమా కోసం తమ డేట్స్ ని కేటాయించి ముందుకు సాగుతున్నారు. విజువల్ వండర్స్ గా సినిమాలను తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో వాళ్లు అన్ని రోజులు డేట్స్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
ఇక ఇప్పుడున్న దర్శకులలో పూరి జగన్నాథ్ చాలా ఫాస్ట్ గా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ అందుకోగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు మాత్రం అనిల్ రావిపూడి అనే చెప్పాలి. ఏ స్టార్ హీరోతో అయిన కూడా పూర్తి చేసి ఆరు నెలల్లో సినిమాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆరు నెలల్లో సినిమా చేసి రిలీజ్ చేయడం అనేది అంత ఆశ మాషీ వహారమైతే కాదు.
మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట కూడా ఆయన ఇలాంటి దూకుడుతో ముందుకు దూసుకెళ్తే మాత్రం భారీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకులలో ఇతను కూడా ఒకడిగా నిలిచిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్లు సైతం పూరి జగన్నాథ్ తర్వాత అనిల్ రావిపూడి మాత్రమే చాలా తక్కువ సమయంలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు.
కాబట్టి చాలా మంది ప్రొడ్యూసర్లు మాతో ఒక్క సినిమా చేయమని అతని వెంట పడుతున్నట్టుగా తెలుస్తోంది… మరి ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాతో కూడా ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన రేంజ్ మరింత పెరిగిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక మీదట కూడా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి…