Horoscope Today: ఈరోజు ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. బుధవారం సోహోగ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని ఆదాయం వస్తుంది. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారిని కలుస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వచ్చే అవకాశం. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు. అయితే పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
వృషభ రాశి:
వ్యాపారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దీంతో ఊహించని లాభాలు ఉంటాయి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. పనిభారం పెరుగుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి:
జీవిత భాగస్వామితో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. స్నేహితులను కలిసి ఉల్లాసంగా ఉంటారు. బంధువులతో సంబంధాలు మెరుగువుతాయి.
కర్కాటక రాశి:
స్నేహితులతో సరదాగా ఉంటారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికంగా బలపడే అవకాశం. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పదోన్నతులపై శుభవార్త వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహారాశి:
తొందరపడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా లాభపడుతారు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందువల్ల నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.
కన్య రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు సేవ చేస్తారు. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. స్నేహితులతో సంయమనం పాటించాలి. ఇతరులతో ఎక్కవుగా వాదనలు చేయొద్దు.
తుల రాశి:
వ్యాపరులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిక చూపుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల ఫలితాలు. ఉద్యోగులు జీత భత్యాలు పై శుభవార్త వింటారు. అనుకోని ఆదాయం పెరుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి:
కుుటంబ సభ్యుల నుంచి సలహా తీసుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహా తీసుకోవాలి.
ధనస్సు రాశి:
ఎవరిదగ్గర నుంచైనా అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెండింగులో ఉన్న పనులు పూర్తవుాయి. సమయస్పూర్తితో వ్యవహరించి ఆదాయం పెంచుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులపై శుభవార్త వింటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కొందరు కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి:
పెట్టుబడుల విషయంలోకీలక నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ రంగాల వారికి అనుకూల ఫలితాలు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉపాధి మార్గాలు ఏర్పడుతాయి. ఉపాధి రంగంలో పనిచేసేవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇతరులతో వాదానలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
వ్యాపారులు కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విహర యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఏదైనా పని ప్రారంభింస్తే అందులో విజయవకాశాలు ఎక్కువ. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీనరాశి:
ఇతరులే ఎక్కువగా కష్టపెట్టాలని చూస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.