https://oktelugu.com/

Rajinikanth: ఆ సినిమా చేస్తే రజినీకాంత్ చనిపోతాడని చెప్పడం వల్లే ఆయన ఆ మూవీ నుంచి తప్పుకున్నాడా..?

రజినీకాంత్ లాంటి స్టార్ హీరో చేసిన చాలా సినిమాలు తెలుగు తమిళ్ భాషల్లో సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి... రజినీకాంత్ హీరోగా నటించిన 'చంద్రముఖి ' సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. 2005వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో రికార్డ్ స్థాయి లో కలెక్షన్స్ ను సాధించింది.

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 08:30 AM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ హవా అనేది ఎక్కువగా కొనసాగుతుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ లో సీక్వెల్ సినిమాల ట్రెండ్ కి పునాది వేసిన సినిమా బాహుబలి… అయితే ఈ సినిమా రెండు పార్టు లుగా వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇక అప్పటినుంచి ప్రతి సినిమాకి సీక్వెల్ తీస్తే సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఇలా చేసి మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని వాడుకోవడంలో చాలా వరకు సక్సెస్ ని సాధిస్తున్నారు. ఇలా సీక్వెల్స్ రావడం పట్ల ప్రేక్షకులు కూడా చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వచ్చి కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే, మరికొన్ని మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి… ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి ‘ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. 2005వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో రికార్డ్ స్థాయి లో కలెక్షన్స్ ను సాధించింది. డబ్బింగ్ సినిమాగా వచ్చిన కూడా ఇక్కడ స్ట్రైయిట్ సినిమాలను సైతం బీట్ చేస్తూ భారీ వసూళ్లను రాబట్టి రజనీకాంత్ స్టామినా ఏంటో మరొకసారి తెలుగు బాక్సాఫీస్ వద్ద నిరూపించింది. ఇక ఇలాంటి సమయంలోనే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ సినిమాకి సీక్వెల్ ని తీయాలని డైరెక్టర్ పి వాసు రజనీకాంత్ ని సంప్రదించాడు.

    అయితే అప్పటికే రజనీకాంత్ ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కానీ ఈ సినిమాకి సీక్వెల్ లో నటించిన తర్వాత కన్నడ స్టార్ హీరో అయిన విష్ణువర్ధన్ అలాగే సౌందర్య ఇద్దరు కూడా మరణించారు. దాంతో ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తే రజనీకాంత్ కూడా మరణిస్తాడు అని కొంతమంది చెప్పడం వల్లే తను ఈ సినిమా చేయలేదని దానివల్ల దర్శకుడు పీ వాసు వెంకటేష్ ని పెట్టి ‘నాగవల్లి ‘ పేరుతో ఈ సినిమాని తీశారు అంటూ అప్పట్లో కొన్ని పుకార్లైతే వచ్చాయి. నిజానికి రజనీకాంత్ ఈ సినిమా చేయడం వల్ల తనకు ఏదో ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను వదిలేయలేదు.

    పి వాసు రెడీ చేసిన కథ తో ఈ సినిమాకి సీక్వెల్ చేసిన కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదనే ఉద్దేశ్యంతోనే రజినీకాంత్ ఈ సినిమా నుంచి తప్పకున్నట్టుగా తెలుస్తుంది… అయితే రజనీకాంత్ లాంటి నటుడు నాగవల్లి లాంటి సినిమా చేసిన పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండేది కాదు. నిజానికి ఈ సినిమా విషయం లో రజనీకాంత్ తీసుకున్న డిసిజన్ కరెక్ట్ అయింది…ఇక చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి సినిమా చంద్రముఖి సినిమాను బీట్ చేయడంలో చాలావరకు ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ సినిమాగా మిగిలడమే కాకుండా వెంకటేష్ ఇమేజ్ ని కూడా చాలా వరకు డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

    అప్పటివరకు సాఫ్ట్ సినిమాలు, కామెడీ సినిమాలు, ఎమోషనల్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చిన వెంకటేష్ ఇలాంటి జానర్ లో ఎందుకు సినిమా చేశాడు అంటూ ప్రతి ఒక్కరు తలలు పట్టుకున్నారు.నిజానికి అది వెంకటేష్ చేయాల్సిన సినిమా అయితే కాదు. కానీ పి.వాసు లాంటి స్టార్ డైరెక్టర్ అడగడంతో వెంకటేష్ కాదనలేక ఈ సినిమా చేసినట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే రజనీకాంత్ ఈ సినిమా రిజల్ట్స్ ని ముందుగానే జడ్జ్ చేసి ఈ సినిమా నుంచి తప్పుకొని మంచి పని చేశారంటూ రజనీకాంత్ అభిమానులు ఆయన తీసుకున్న నిర్ణయానికి సంతోషించారు…