Horoscope Today: 2024 జూన్ 27 గురువారం రోజున ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు భూతాదిత్య యోగం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉండనుంది.
మేష రాశి:
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. ఆకస్మికంగా ధనం పెరిగే అవకాశం. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది.
వృషభ రాశి:
సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడతారు.
మిథున రాశి:
పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. సమర్థత ఆధారంగా ప్రశంసలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.
కర్కాటక రాశి:
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
సింహారాశి:
వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొందరికి అనుకోని అదృష్టం పెరిగే అవకాశం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు అనుకూల వాతావరణం.
కన్య రాశి:
విద్యార్థులకు సంబంధించి శుభవార్త వింటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సలహాతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
తుల రాశి:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు పెట్టుబడులకు అనుకూల సమయం.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నైపుణ్యంతో పనిచేయడం వలన ప్రశంసలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ధనస్సు రాశి:
తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. విద్యార్థుల సంబంధించి శుభవార్త వింటారు.
మకర రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు అనుకొని లాభాలు ఉంటాయి. ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
కుంభరాశి:
ఉద్యోగులకు అనుకూల వాతావరణ ఉంటుంది. కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా ఉంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మీనరాశి:
వ్యాపారులు అనుకొని లాభాలు పొందుతారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి బహుమతి కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.