Horoscope Today: 2024 జూన్ 22 శనివారం రోజున ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకొని అదృష్టం కలగనుంది.
మేష రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
విద్యార్థులకు సంబంధించి నిరాశ వార్తల ఎదుర్కొంటారు. వ్యాపారులకు విజయాలు ఉంటాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు
వృషభ రాశి:
రాజకీయ రంగాల వారికి అనుకూల వాతావరణం. పాత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
మిథున రాశి:
పెండింగ్లో పనులను ఈరోజుతో పూర్తి చేస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఎక్కువ గా కష్టపడాల్సి వస్తుంది. ప్రియమైన వారితో కలిసి మెలిసి ఉంటారు.
కర్కాటక రాశి:
ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు అనుకోని అదృష్టం కలుగుతుంది. రాజకీయ నాయకులు సమాజంలో గౌరవం పొందుతారు.
సింహారాశి:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పట్ల ఎక్కువగా వాదనలు చేయొద్దు. జీవిత భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు . సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కన్య రాశి:
వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.
తుల రాశి:
ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు ఉండే అవకాశం. ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. శత్రువులు వేధించడానికి ప్రయత్నించినా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు.
ధనస్సు రాశి:
కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం చేస్తారు. వ్యాపారులకు అనుకొని లాభాలు వచ్చే అవకాశం. వైవాహిక జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు.
మకర రాశి:
ఎక్కువగా వాదనలు చేయొద్దు. జీవనోపాధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కష్టాలు ఎదురైనా అనుకున్న పనిని పూర్తి చేస్తారు.
కుంభరాశి:
అనుకోని ప్రయాణాలు ఉంటాయి. చివరి సమయంలో డబ్బులు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉంటుంది. కొన్ని ఖర్చులు పెరుగుతాయి.
మీనరాశి:
కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
Srinivas Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More