https://oktelugu.com/

Horoscope Today: గురుమంగళ యోగం కారణంగా ఈ రాశి వారికి అధిక ధన లాభం..

కొన్ని సంబంధాల్లో చీలిక ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండే అవకాశం. కుటుంబంలో పిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. వ్యాపారులు కొన్ని విషయాల్లో విఫలం అవుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2024 / 07:42 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: 2024 జూలై 19 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. శుక్రవారం నాడు గురుమంగళ యోగం కారణంగా సింహ రాశికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి:
    ఇతరుల వద్ద నుంచి రుణం తీసుకుంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత ఉండేలా చూసుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

    వృషభ రాశి:
    ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు.

    మిథున రాశి:
    అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కర్కాటక రాశి:
    విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ప్రేమను పొందుతారు.

    సింహారాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. పిల్లలతో సంబంధాలు మెరుగుపడుతాయి.

    కన్య రాశి:
    కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు కొత్త ఆఫర్లు పొందుతారు. కెరీర్ కు సంబంధించి శుభవార్త వింటారు.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది.

    తుల రాశి:
    కుటుంబ సభ్యులతో బిజీగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోని ఆస్తి వచ్చి చేరుతుంది. విద్యార్థులు కొత్త పుస్తకాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువగా వాదనలు చేయొద్దు.

    వృశ్చిక రాశి:
    కొన్ని సంబంధాల్లో చీలిక ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండే అవకాశం. కుటుంబంలో పిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. వ్యాపారులు కొన్ని విషయాల్లో విఫలం అవుతారు.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు లాభాలు పొందడానికి అనుకూల సమయం. జీవిత భాగస్వామితో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల మధ్య వివాదాలు సమసిపోతాయి.

    మకర రాశి:
    వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది.

    కుంభరాశి:
    కొందరు కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. అవసరాలకు అనుగుణంగా మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. తెలివితేటల కారణంగా ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు పెరుగుతుంది.

    మీనరాశి:
    కొన్ని విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరితో గొడవలు ఉండే అవకాశం. అందువల్ల వాదనలు ఎక్కువగా ఉండకుండా చూడాలి.