PhonePe New Feature: నేటి కాలంలో ఫోన్ పే వాడకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారు చాలా తక్కువ మందే అనుకోవచ్చు. ఎందుకంటే ఏ వస్తువు కొనుగోలు చేసిన ఫోన్ పే కచ్చితంగా వాడుతున్నారు. అలాగే ఇతరులకు డబ్బులు పంపించుకోవడానికి దీనినే ఎక్కువగా యూస్ చేస్తున్నట్లు కొన్ని లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే ఫోన్ పే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఇప్పటివరకు ఫోన్ పే ద్వారా బ్యాంకు లింకేజీ అయి బ్యాంకు నుంచి డబ్బులను పంపించుకునే వాళ్ళం. అలాగే క్రెడిట్ కార్డు తో లింక్ అయ్యి Rupay కార్డు ద్వారా కొన్ని బిల్లులు చెల్లించుకునేవారు. కానీ ఇకనుంచి కూడా మరో విధంగా బిల్లులు చెల్లించుకోవచ్చు.. లేదా ఇతరులకు డబ్బులు పంపించుకోవచ్చు. ఈ సదుపాయం జూలై 31
నుంచి అందుబాటులోకి వచ్చింది. మరి అది ఏంటో తెలుసుకుందామా..
Also Read: HDFC క్రెడిట్ కార్డ్ ఉన్న వారందరికీ ఇదీ షాకింగ్ న్యూస్..
ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాలన్నా.. ఇతరులకు మనీ సెండ్ చేయాలన్నా.. బ్యాంకు లో అమౌంట్ కచ్చితంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పై కూడా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గోల్డ్ లోన్ కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారు. ఈ రెండిటి పైన లోన్ తీసుకున్న సమయంలో వచ్చిన మొత్తంలో కొంత నగదును Creditline ద్వారా కూడా చెల్లించవచ్చు. అసలు క్రెడిట్ లైన్ అంటే ఏమిటి?
మనం ఏదైనా రుణం తీసుకునే సమయంలో కొంత భాగాన్ని వాడుకొని మరికొంత మొత్తాన్ని క్రెడిట్ లైన్ లోకి మార్చాలని బ్యాంకు అధికారులను కోరవచ్చు. ఉదాహరణకు 1,50,000 రుణం తీసుకుంటే.. ఇందులో లక్ష రూపాయల వరకు ఇతర అవసరాలకు వాడుకొని.. మిగతా 50 వేల రూపాయలను క్రెడిట్ లైన్ కు లింకు చేయమని కోరాలి. ఇలా చేసిన తర్వాత ఫోన్ పే లో ఉన్న క్రెడిట్ లైన్ ఆప్షన్ ద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చు.
Also Read: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? రేపటి నుంచి కొత్త రూల్స్..
అయితే ఈ మొత్తాన్ని బ్యాంకు లో కూడా డిపాజిట్ చేసి వాడుకోవచ్చు. కానీ ఇలా క్రెడిట్ లైన్ పై బిల్లులు చెల్లించడం ద్వారా కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం లేదా ఫిక్స్డ్ డిపాజిట్ పై తీసుకునే లోన్ మొత్తాన్ని 50 వేల వరకు క్రెడిట్ లైన్ పై మార్చుకోవడం ద్వారా ఇందులో ఆ మొత్తం యాడ్ అవుతుంది. అయితే ఈ మొత్తంలో ఎంత అయితే అమౌంట్ వాడుకుంటామో.. దానికి మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 50 వేల వరకు క్రెడిట్ లైన్ కు మార్చుకుంటే.. ఇందులో కేవలం 10000 వరకు మాత్రమే క్రెడిట్ లైన్ ద్వారా వాడితే.. ఆ మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.. మిగతా 40 వేలకు ఎలాంటి వాటి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా అవసరంలేని మొత్తానికి వడ్డీ చెల్లించకుండా నిలువ ఉంచుకోవచ్చు. దీంతో కొంతవరకు వడ్డీని సేఫ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొత్తం అందుబాటులోనే ఉండి అవసరానికి ఉపయోగపడుతుంది.