Honda-Car
Honda: భారత్ లో హోండా కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే Honda కంపెనీ నుంచి Amaze, Elevate, Honda city కార్లు మార్కెట్లోకి వచ్చి ఆదరణ పొందాయి. డిజైన్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించే ఈ కంపెనీ కార్లు చూడగానే ఆకట్టుకుంటాయి. ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ సాధించుకుంటూ మార్కెట్లోకి వస్తున్న ఈ కార్లు మిగతా వాటితో పోటీ పడుతూ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో హోండా కంపెనీ నుంచి రెండు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన పిక్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..
Honda కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లలో Elevate ఒకటి. ఈ మోడల్ ఇప్పుడు బ్లాక్ ఎడిషన్ లో కొత్తగా రాబోతుంది. కొత్త ఏడాది సందర్భంగా జనవరిలో దీనిని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. SUV వేరియంట్ లో ఉన్న ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆదరణ పొందింది. దీనిలో కొన్ని మార్పులు చేసుకొని ప్రత్యేకంగా నిలిచేందుకు రెడీ అవుతోంది. కొత్త ఎలివేట్, సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు ఎడిషన్లను కలిగి ఉంటుంది. వీటిలో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ రూఫ్ రెయిల్ వంటివి ఆకర్షిస్తున్నాయి.
ఈ రెండు కార్లు పూర్తిగా బ్లాక్ లోనే రానున్నాయి. ఇవి స్పెక్ ట్రిమ్ పై ఆధారపడి పనిచేస్తాయి. సింగిల్ పేన్ సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కార్ టెక్, లెవల్ 2 ఆడాస్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఇంజిన్ విషయానికొస్తే ఈ కార్లలో 1.5 లీటర్ 4 సిలిండ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండనున్నాయి. ఈ ఇంజిన్ 119 బీహెచ్ పీ పవర్ తో పనిచేస్తూ 145 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి.
ఈ జనవరిలో ఈ కార్లో ఆటో ఎక్స్ పోలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత కొన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని అం్టున్నారు. ఇప్పటి వరకు ఉన్న హోండా ఎలివేట్ 11.73 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఇంచు మించి వీటికంటే ఎక్కువ ధరనే కలిగి ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. స్టాండర్ట్ కారు కొనాలని ఆసక్తి ఉన్న వారు.. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రీమియం లుక్ లో ఈ కారు ఆకట్టుకుంటుంది. అయితే దీని లాంచ్ వివరాలు ఎక్స్ పో తరువాత వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇంతలో దీని చిత్రాలు ఆన్ లైన్ లోకి రావడంతో ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన హోండా కార్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే రెండు మోడళ్లు అప్డేట్ తో రావడంతో మరింత సేల్స్ పెంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇవి వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.