Homeలైఫ్ స్టైల్Homing pigeons travel 265 km: 5 గంటల్లో 265 కి.మీ. ప్రయాణం.. జిపిఎస్ లేకుండా...

Homing pigeons travel 265 km: 5 గంటల్లో 265 కి.మీ. ప్రయాణం.. జిపిఎస్ లేకుండా గమ్యస్థానం.. ఈ పావురాల గురించి తెలుసా?

Homing pigeons travel 265 km: ప్రస్తుత కాలంలో ఒక సమాచారం ఇతరులకు చేరడానికి అనేక ఎలక్ట్రానిక్ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా మొబైల్ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం చేరడానికి పావురాలను ఉపయోగించేవారు. కాలక్రమేనా ప్రస్తుతం మొబైల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే ఇంతటి టెక్నాలజీ యుగంలోనూ ఒడిశా రాష్ట్రంలో సమాచారం అందించడానికి పావురాలను ఉపయోగిస్తున్నారు. 2008 సంవత్సరంలో ఈ పావురాల సేవలను అధికారికంగా నిలిపివేసినప్పటికీ.. గణతంత్ర దినోత్సవం వంటి వేడుకల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.. ఈ పావురాల గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పావురాల ద్వారా సమాచారం అందించే పద్ధతి బ్రిటిష్ పాలనలోనే ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమైంది. ఆ సమయంలో అడవులు, కొండలు, నదులతో కూడిన ప్రాంతాల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి వీటిని ఉపయోగించేవారు. పోలీసు శాఖ, సైన్యం, పరిపాలన వ్యవస్థ అత్యవసర సమాచారాన్ని పంపించేందుకు పావురాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. 1948లో దేశంలో భద్రతా పరిస్థితులు సున్నితంగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అత్యవసర సందేశాన్ని పంపాల్సి వచ్చింది. దీంతో ఒడిశాలోని సంబల్పూర్ నుంచి కటక్ వరకు సుమారు 265 కిలోమీటర్ల దూరం ఒక శిక్షణ పొందిన పావురం కేవలం ఐదు గంటల 20 నిమిషాల్లోనే పూర్తి చేసి సందేశాన్ని అందించింది. దీనిని బట్టి పావురాలు సమాచారాన్ని చేరవేయడానికి ఎంతటి సమర్థవంతంగా పనిచేస్తాయో అర్థం అవుతుంది.

స్వాతంత్రం తర్వాత కూడా ఒడిశా పోలీసులు పావురాల సేవలను పొందుతూ వస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా శిక్షణ విచ్చే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో, అరణ్య ప్రాంతాల్లో పోలీస్ కమ్యూనికేషన్స్ కోసం, యుద్ధ కాలంలో అత్యవసర పరిస్థితుల సమాచారం అందించడానికి ఈ పావురాలను ఉపయోగించేవారు. అయితే మొబైల్ ఫోన్లు, వైర్లెస్ కమ్యూనికేషన్ ఉపగ్రహ వ్యవస్థలు విస్తరించడంతో పావురాల అవసరం తగ్గింది. దీంతో 2008 లో ఒడిశా ప్రభుత్వం అధికారికంగా Carrier Pigeon Service నువ్వు నిలిపివేసింది. ఈ సమయంలో 70 వరకు పావురాలు రవాణా వ్యవస్థకు ఉపయోగపడేవి. అయితే పావురాలను ఇక్కడికి పోలీసులు పోలీస్ వారసత్వ సంపదగా గుర్తించారు. దీంతో వీటిని గణతంత్ర దినోత్సవ పరేడ్ లలో ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు పావురాల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. పావురాల సేవలను మనుషులు ఎలా ఉపయోగించుకున్నారో వివరిస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటి జిపిఎస్ లేకపోయినా కూడా పావురాలు సూర్య స్థానం, భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా గమ్యస్థానాన్ని గుర్తించేవి. అందుకే అవి శతాబ్దాల పాటు రవాణా సేవలను అందించాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular