
Kidneys Health: మన శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించే అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు దెబ్బతింటే ఇక డయాలసిస్ కు వెళ్లాల్సి వస్తుంది. దీంతో చాలా సమస్యలు వస్తాయి. మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో మూత్రపిండాలు నిర్వహించే విధులు గురించి తెలుసుకుని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎముకలో గుజ్జు తయారు కావడానికి సహకరిస్తాయి. మూత్రపిండాల పనితీరు బాగా లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటాం.
మూత్రపిండాలు దెబ్బతింటే..
మూత్రపిండాలు దెబ్బతింటే రక్తహీనత సమస్య వస్తుంది. శరీరంలో నీరు చేరి ఉబ్బుతాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మూత్రపిండాలు బాగా పనిచేసేలా చూసుకోవాలి. మూత్రపిండాలు ఎ,సి, ఇ అనే ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎంజైమ్ విడుదల అయితేనే రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే మూత్రపిండాలు బాగా పని చేస్తాయి. మూత్రపిండాలు బాగుంటేనే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో మూత్రపిండాలు దెబ్బతినడం సహజమే. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం.
విటమిన్ డి ని ఉత్తేజ పరచడంలో..
ఎముకలు దృఢంగా ఉంచడంలో జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు అవసరం. విటమిన్ డి సూర్యరశ్మితో వస్తుంది. డి విటమిన్ ఉత్తేజంగ పనిచేయించడంలో మూత్రపిండాల పాత్ర కీలకం. మూత్రపిండాలు ఉత్తేజ పరిస్తేనే నిర్జీవంగా ఉండే విటమిన్ డి శరీరానికి అందుతుంది. విటమిన్ డి తలెత్తకుండా చేస్తుంది. ఇలా మూత్ర పిండాలు మన దేహానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నాయి. అందుకే వాటిని దెబ్బతినకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు బాధలు రాకుండా ఉంటాయి.
ఇతర అనారోగ్య సమస్యలు..
రక్తంలో లవణాలు, ఎలక్ర్టోలైట్స్ నియంత్రణంలో ఉంచడంలో కూడా మూత్రపిండాలు సాయపడతాయి. ఇవి పనిచేయకుండా పోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇలా కిడ్నీలు మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. నిత్యం కనీసం మగవారైతే ఐదు లీటర్ల నీరు, ఆడవారైతే నాలుగు లీటర్ల నీరు తాగుతూ ఉండాలి. లేదంటే అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఐదు లీటర్ల రక్తాన్ని..
మన శరీరంలో ఉన్న ఐదు లీటర్ల రక్తాన్ని ప్రతి గంటకోసారి ఫిల్టర్ చేసే మూత్రపిండాలు మంచి పాత్ర వహిస్తాయి. ఈ నేపథ్యంలో మూత్రపిండాల పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వాటితో మనకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకపోతే సమస్యలు వస్తాయి. అందుకే రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలే ప్రధానంగా ఉంటాయి. దీంతో మనకు అనారోగ్యాలు దరిచేరకుండా చేయడంలో మనమే అప్రమత్తంగా ఉండాలి.