
Actress Amani: మొన్నటి తరం హీరోయిన్స్ లో అందం తో పాటు అద్భుతమైన అభినయం పలికించే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు ఆమని.ఆరోజుల్లో ఈమె ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలలో నటించేవారు,అలా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.అసభ్యకరమైన సన్నివేశాలు చెయ్యడం కానీ,అందాల ఆరబోత సన్నివేశాల్లో కానీ నటించడానికి పెద్దగా ఇష్టపడని ఆమని కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసేది.అలాంటి పాత్రలతోనే ఈమె దశాబ్దం వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా బాగా రాణిస్తుంది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన సినీ కెరీర్ లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చింది.ఆమె చెప్పిన ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న గారు డిస్ట్రిబ్యూటర్ అవ్వడం తో చిన్నప్పటి నుండి నాకు సినిమాల మీద అమితాసక్తి ఉండేది, ఎలా అయినా హీరోయిన్ అయ్యి మంచి పేరు సంపాదించాలనే కోరిక ఉండేది.అలా కెరీర్ తొలినాళ్లలో తమిళ సినిమాలలో నటించడానికి రెండేళ్లు కష్టపడ్డాను.మా నాన్నకి నేను అసలు సినిమాల్లోకి రావడమే ఇష్టం లేదు.ఆయనకీ ఎందుకు ఇష్టం లేదు అన్నాడో, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, సినిమాల్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్స్ ఏమి అడిగిన చెయ్యాలి అనేవారు.నాకు మొదట్లో ఆ మాటలకు అర్థం తెలియలేదు, కానీ మా అమ్మ వల్ల దానికి అసలు అర్థం ఏంటో తెలుసుకొని చాలా బాధపడ్డాను.నాన్న మాట వినాల్సింది,అనవసరంగా సినిమాల్లోకి వచ్చాను అనిపించింది అప్పుడు.నా పరిమితి దాటలేదు కాబట్టే నాకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఆమని.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నా మొట్టమొదటి సినిమా జంబాలకాది పంబ..ఈ సినిమాలో నటించే ముందు ఈవీవీ గారు నాకు మందు , సిగరెట్ కొట్టే సన్నివేశాలు ఉన్నాయని చెప్పలేదు.ఒకరోజు ఈవీవీ గారు ‘ఏ అమ్మాయి, నీకు ఈరోజు మందు సిగరెట్ కొట్టే సన్నివేశాలు షూటింగ్ ఉంది’ అని అనగానే సార్ అంటూ మొహం చాలా ఇబ్బందిగా పెట్టాను, అప్పుడు ఈవీవీ గారు మందు బాటిల్ లో కూల్ డ్రింక్ పోసి ఇస్తానులే కంగారు పడకు, కాకపోతే బాటిల్ ఓపెన్ చేసినప్పుడు నురగ పొంగాలి, అంతే కాకుండా సిగెరెట్ మాత్రం నిజంగా తాగాలి, అని అన్నాడు..సుమారుగా అరగంటసేపు ప్రాక్టీస్ చేసి ఆ సన్నివేశాన్ని చేసేసాను.రీసెంట్ గా వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కూడా మందు కొట్టే సన్నివేశాలు ఉంటే నటించేసాను’ అంటూ చెప్పుకొచ్చింది ఆమని.