Healthy sleep plan: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నాణ్యమైన ఆహారం మాత్రమే కాదు.. సరైన నిద్ర కూడా చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నేటి కాలంలో రకరకాల కారణాలవల్ల పిల్లల నుంచి పెద్దల వరకు సరైన నిద్ర పోవడం లేదు. దీంతో అనేకరకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఒకరోజు నిద్ర సరిగ్గా లేకపోతే అలసటతో పాటు.. మతిమరుపు అలాగే ఏ పనిపై శ్రద్ధ లేకపోవడం వంటివి ఉంటాయి. అలాగని అనుకున్న దానికంటే ఎక్కువగా నిద్రపోతే బద్ధకం తయారవుతుంది. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా సరైన నిద్ర గడియారాన్ని పాటించలేరు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఒత్తిడి లేదా ఇతర కారణాలవల్ల రాత్రిళ్ళు మెలకువ ఉంటూ ఉదయం వెంటనే లేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివారు ఎలాంటి నిద్ర ప్లాన్ చేసుకోవాలి.? వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి?
Also Read : వేసవిలో ఈ సత్తు తింటే చాలా ప్రయోజనాలు.. మరి ఎలా తయారు చేయాలంటే?
సాధారణంగా కాస్త కునుకు తీసి మెలకువ అయితే ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటిది సరిగా నిద్రపోతే శరీరం ఎంత ఉత్సాహంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అయితే నేటి కాలంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. చదువుల పేరుతో రాత్రులు ఎక్కువసేపు చదివిస్తూ.. ఉదయం తొందరగా నిద్ర లేపుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల వారి మెదడుపై ప్రభావం పడి భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా.. వారికి సరైన నిద్రపోయే అవకాశాన్ని ఇవ్వాలి. వారు సరిగ్గా నిద్రపోతే ఉత్సాహంగా ఉండి చదువులో రాణిస్తారు. 20 ఏళ్లలోపు వారు కనీసం 10 నుంచి 14 గంటల వరకు నిద్రపోయే అవకాశం ఇవ్వాలి.
ఇక పెద్దల విషయంలో ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలవల్ల సరైన నిద్రపోయే అవకాశం ఉండదు. పనుల కారణంగా రాత్రులు మెలకువతో ఉండి.. ఉదయం తొందరగా లేవాల్సి వస్తుంది. అయితే ఇది ఒక్కరోజు కాకుండా కొన్ని రోజులపాటు ఉంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాత్రిళ్ళు నిద్ర కో భంగం కలిగిన మధ్యాహ్నం అయినా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. మొత్తంగా యవ్వనంతో పాటు 40 ఏళ్ల లోపు వారు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
కానీ కొన్ని కారణాలవల్ల రాత్రులు మెలకువ ఉంటూ.. ఉదయం కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. ఇలాంటివారు కనీసం వారంలో కొన్ని రోజులపాటు అయినా ప్లాన్ చేసుకొని నిద్రపోయే ప్రయత్నం చేయాలి. లేకుంటే మానసిక సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొందరు కార్యాలయాల్లో లేదా వ్యాపార సముదాయాల్లో నిద్రపోతూ ఉంటారు. అయితే ఇలా నిద్రపోయే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. ఎందుకంటే ఇలా మధ్యలో నిద్ర పోయినా తర్వాత రాత్రిళ్ళు సమయానికి నిద్ర పట్టే అవకాశం ఉండదు.
ఒకవేళ మధ్యాహ్నం నిద్ర పోవాలని అనుకున్న మూడు గంటల లోపు మాత్రమే నిద్రపోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఈ నిద్ర కూడా 45 నిమిషాల లోపు మాత్రమే పోవాలి. అంతకుమించి నిద్ర పోవాల్సి వస్తే రాత్రి ఇబ్బందులు ఎదురవుతాయి.